వార్తలు

Meri Policy Mere Hath: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై ఇంటింటికీ ప్రచారం

0
Meri Policy Mere Hath

Meri Policy Mere Hath: రైతులకు ఫసల్ బీమా పాలసీ అందించేందుకు ఇంటింటికీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలులోకి వచ్చి ఏడు సంవత్సరాలలోకి అడుగు పెడుతుంది. ఈ మేరకు రైతులందరికీ ప్రభుత్వ విధానాలు, భూ రికార్డులు, క్లెయిమ్ ప్రక్రియ, పథకం కింద ఫిర్యాదుల పరిష్కారాల గురించి అవగాహన కల్పించడం కోసం ఇంటింటికీ ప్రచారం చేసేందుకు మేరీ పాలసీ మేరే హాత్ చేపట్టింది కేంద్రం.

Meri Policy Mere Hath

జూన్‌ నుంచి రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తున్న అన్ని రాష్ట్రాల్లో ఇంటింటికీ ప్రచారం ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఫిబ్రవరి 2016లో ప్రారంభించబడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోతే రైతులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 36 కోట్ల మంది రైతుల దరఖాస్తులకు బీమా చేయబడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 4 వరకు ఈ పథకం కింద రూ.1,07,059 కోట్లకు పైగా క్లెయిమ్‌లు చెల్లించారు. ఈ పథకంలో నమోదు చేసుకున్న రైతుల్లో దాదాపు 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే కావడంతో అత్యంత నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించడంలో ఫసల్ బీమా పథకం విజయవంతమైంది.

Meri Policy Mere Hath

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన 2020 సంవత్సరంలో రైతుల స్వచ్ఛంద భాగస్వామిగా మారింది. క్రాప్ ఇన్సూరెన్స్ యాప్, CSC సెంటర్ లేదా సమీపంలోని వ్యవసాయ అధికారి ద్వారా ఏదైనా సంఘటన జరిగిన 72 గంటలలోపు పంట నష్టాన్ని తెలియజేయడానికి రైతుకు సౌకర్యంగా ఉంటుంది ఈ పథకం. అర్హులైన రైతు బ్యాంకు ఖాతాల్లో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో క్లెయిమ్‌ చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు సంబంధిత అధికారులు.

Leave Your Comments

Success story: మల్చింగ్ తో పుచ్చ సాగు- ఐదు లక్షల లాభం

Previous article

COOIT: మార్చి 12-13న సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీ ట్రేడ్ సమిట్

Next article

You may also like