Govt cuts basic customs import duty on refined palm oil కరోనా దెబ్బకు నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక వంట నూనె అయితే రూ.70 నుంచి ఏకంగా రూ.200 కి చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వంట నూనె ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యతో రూ.200 నుంచి 150 కి తగ్గిన వంట నూనె ధరలు, ఇప్పుడు మరింత కిందకు వచ్చే అవకాశం ఉంది. పామాయిల్ పై విధించే కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. విశ్వసనీయ సమాచారం మేరకు శుద్ధి చేసిన పామాయిల్ పై విధించే కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గించనుంది. అయితే తగ్గించిన ఈ సుకం మర్చి 31, 2022 వరకు వర్తిస్తుందని కస్టమ్స్ తెలిపింది. refined palm oil Price
తగ్గిన వంట నూనె ధరలు మంగళవారం నుండి అమల్లోకి వస్తాయి. ఎస్ఈఏ ప్రకారం.. భారత్‌లో వంట నూనె వినియోగం 22 నుంచి 22.5 మిలియన్ టన్నుల మధ్యలో ఉంది. కాగా.. భారత్ దాదాపు 65 శాతం వంట నూనెను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత రెండు మార్కెటింగ్ ఇయర్స్‌లో కోవిడ్ కారణంగా దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడింది. దిగుమతులు 13 మిలియన్ టన్నులకు తగ్గిపోయాయి. దీంతో ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో వంట నూనె ధరలు మళ్ళీ మొదటికి రానున్నాయి. పండుగ వేల నూనె ధరలు తగ్గడంతో సామాన్యుడిపై భారం మరింత తగ్గినట్టే అవుతుంది. Cooking Oil Price