వార్తలు

కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త..

0

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకానికి 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి రూ.16,000 కోట్లు కేటాయించింది. 2020 – 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ.305కోట్లు ఎక్కువగా కేటాయింపులు వచ్చాయని దేశంలో వ్యవసాయరంగ అభివృద్దికి ప్రభుత్వ నిబద్దతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది.

రైతులు తమ పంటలకు భీమా పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. రైతులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం 2016 జనవరి 13న ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని ప్రారంభించింది. అకాల వర్షాలు, ఇతర వాతావరణ పరిస్దితుల కారణంగా రైతులు తమ పంటను నష్టపోతుంటారు. రైతు తన పంటకు భీమా తీసుకునే సదుపాయాన్ని ఈ పథకం కల్పిస్తుంది. విత్తనాలు నాటడం దగ్గర్నుంచి పంటకోతల వరకు ఎప్పుడు ఎలాంటి నష్టం వచ్చినా ఈ పథకం ద్వారా భీమా లభిస్తుంది. అన్ని రకాల ఆహార పంటలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.

ఏటేటా 5.5 కోట్ల మంది రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేస్తుంటారు. వీరిలో 84 శాతం మంది చిన్న రైతులే. భీమా పొదేందుకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియ్జం చెల్లించాలి. ఖరీష్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి.

Leave Your Comments

తీగ జాతి కూరగాయల పంటలలో సస్యరక్షణ

Previous article

పీఎం కిసాన్ స్కీమ్ కొత్త రూల్స్..

Next article

You may also like