వార్తలు

జెమిని వైరస్ వలన ఖమ్మం జిల్లాలో మిరప రైతుల కన్నీళ్లు..

0

భయంకరమైన జెమిని వైరస్ (బొబ్బర తెగులు) ఖమ్మం జిల్లాలోని మధిర, ఏణకూరు,కొణిజెర్ల, కామేపల్లి, తిరుమలయపాలెం మండలాల్లో మిరప రైతుల ఆశలను దెబ్బతీసింది. వైరస్ ప్రభావంతో ఎకరానికి దాదాపు మూడు నుండి ఐదు క్వింటాళ్ల ఉత్పత్తిని కోల్పోయి ప్రభావం ఉందని.. దీని ద్వారా వచ్చే కొద్దో, గొప్పో వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరపకాయ పెంపకానికి ఒక రైతు ఎకరానికి రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షలు పెట్టుబడి పెడతాడు. ప్రస్తుతం ఉన్న రేటును బట్టి చూస్తే.. ఎకరానికి పది క్వింటాళ్లకు పైగా ఉత్పత్తి చేయగలిగితేనే వారు కొంత ఆదాయాన్ని ఆర్జిస్తారు.
వైట్ఫ్లై ద్వారా జెమిని వైరస్ సంక్రమిస్తుంది.
దీని ప్రభావంతో ఆకు – కర్లింగ్, ముడత, బూడిద తెగులు వంటిని పంటకు వ్యాపిస్తాయి. దీంతో పంట దిగుబడి బాగా పడిపోతుంది. కొణిజర్లకు చెందిన కౌలుదారు రైతు కె. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎకరానికి రూ. 25 వేల కౌలు చెల్లించి మరీ మిరప పంట వేశానని చెప్పారు. అయితే, జెమిని వైరస్ కారణంగా, దిగుబడి భారీగా తగ్గిపోయిందని వెల్లడించారు. తాను ఇప్పటివరకూ రూ. 2.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, పెట్టుబడి డబ్బు కూడా వెనక్కి వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో 56,000 ఎకరాలలో మిరప పంటను ఈ ఏడాది సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 2 వేల ఎకరాలు ఎక్కువ. పోయిల్ సంవత్సరం క్వింటాల్ కు రూ. 20 వేలు వరకు ధర పలకడం తో రైతులు మిరప సాగు వైపు మొగ్గు చూపారు. విత్తనాల రకం ఆధారంగా ప్రస్తుతం దీని ధర క్వింటాల్ కు రూ.9,000 నుంచి రూ.14 వేల మధ్య పలుకుతుంది. పొలంలో దున్నుతున్నప్పుడు రైతులు ట్రెక్ డెర్మా వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జి. అనసూయ సూచించారు. ప్రతి రెండు, మూడు సంవత్సరాల తరువాత పంట మార్పిడి చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు.

Leave Your Comments

క్యాబేజీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

తెలంగాణలో ఈరోజు రేపు వర్షం..

Next article

You may also like