వార్తలు

చేపల దిగుబడిని పెంచే మేత – యాజమాన్యం

0

ఉభయ తెలుగు రాష్ట్రాలు చేపల చెరువుల్లోనూ మంచి నీటి చేపల పెంపకం చేపడుతున్నారు. అయితే దిగుబడి మాత్రం తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో కన్నా కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉంది. దీనికి చేపల పెంపకంలో కోస్తాలో రైతు అవలంబిస్తున్న సరైన యాజమాన్య పద్ధతులే కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని కొద్ది మంది రైతులు మాత్రం అక్కడక్కడా చేపల పెంపకంలో కొన్ని యాజమాన్య పద్ధతులను చేపట్టి కాస్త మంచి దిగుబడిని పొందుతున్నారు. మిగతా రైతులు కూడా వీలైన అన్ని చెరువుల్లో కనీస యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తే దిగుబడిని గణనీయంగా పెంచవచ్చు. చేపల దిగుబడిని పెంచే సస్యరక్షణ పద్ధతుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ఎరువు వాడడం :

ఎరువు చేరువులోని మట్టిని, నీటిని ఫలవంతం చేస్తాయి. చేపల సహజ ఆహారమైన ప్లవకాల అధిక పరిమాణంలో ఉత్పత్తి చేస్తాయి. పశువు పేడ, కోళ్లపెంట సాధారణంగా వాడే సేంద్రియ ఎరువు కాగా యూరియా, సూపర్‌ఫాస్ఫేట్‌, పొటాష్‌ సాధారణంగా వాడే రసాయనిక ఎరువులు. ఈ ఎరువులు దాదాపు అన్నిచోట్ల లభిస్తాయి.

వాడాల్సిన పరిమాణం :

సేంద్రియ, రసాయనిక ఎరువును నిర్ణయించిన పరిమాణంలోనే చెరువులో వేయాలి. వాడాల్సిన ఎరువు పరిమాణాన్ని ఒక హెక్టారుకు పట్టికలో చూడవచ్చు.

ఎరువు రకం :

1. సేంద్రియ ఎరువులు :
పశువు పేడ 1000
కోళ్ళపెంట 500
2. రసాయనిక ఎరువులు :
యూరియా                 8
సూపర్‌ ఫాస్ఫేట్‌         20
మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌   3

గమనిక :

. సేంద్రియ, రసాయనిక ఎరువులను 15 రోజుల వ్యవధిలో ఒకదాని తరువాత మరొకటి వాడాలి.
. బాగా కుళ్ళిన (మాగిన) సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి.
. నీటి గుణం చెడిపోయినప్పుడు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే డిసెంబర్‌, జనవరి మాసాల్లో ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలి.
ఎరువులు వేసే విధానం :
నిర్ణయించుకున్న మోతాదులో చెరువంతా సమానంగా చల్లాలి. దీనికి పుట్టి లేదా రేకు పడవను ఉపయోగించుకోవాలి. ఎరువులను ఒకే దగ్గర లేదా అక్కడక్కడా కుప్పలుగా పోయరాదు.

సున్నం వాడకం :

చేపల పెంపకంలో సున్నం వాడకం వల్ల అనేక లాభాలున్నాయి. ఇది నీటి ఆమ్లత్వాన్ని సరిచేసి, చేపల సక్రమ పెరుగుదలకు దోహదపడుతుంది.

మోతాదు :

నీటి ఉదజని సూచికపై సున్నం మోతాదు ఆధారపడి ఉంటుంది. సాధారణ పరిస్థితిలో ప్రతి నెల సుమారు 10-15 కిలోల సున్నంను ఎకరాకు చెరువంతటా చల్లాలి.

అనుబంధ ఆహారం :

చెరువులో చేపల సంఖ్య తక్కువగా ఉంటే అనుబంధ ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాని చెరువులో చేపల సాంద్రత అధికంగా ఉన్నా దిగుబడి ఎక్కువ కావాలకున్నప్పుడు మాత్రం అనుబంధం ఆహారం తప్పనిసరిగా ఇవ్వాలి. చేపలు అధికంగా ఉన్నప్పుడు చెరువులో ఉత్పత్తి అయ్యే సహజ ఆహారం సరిపోదు. చేపలు త్వరగా పెరిగి అధికోత్పత్తి పొందడానికి అదనంగా అనుబంధ ఆహారాన్నివ్వడం చాలా ముఖ్యం. తవుడు నూనె తీసిన వేరుశనగ చెక్క సాధారణంగా వాడే అనుబంధ ఆహారం. ఇది అన్ని ప్రాంతాల్లో భిస్తుంది.

ఇవ్వాల్సిన ఆహార పరిమాణం :

చేపల సైజును, ఉష్ణోగ్రతను బట్టి చేపలు బరువుతో కనీసం 2-3 శాతం వరకు అనుబంధాహారం ఇవ్వాలి. రోజు చేపలు తీసుకొనే ఆహారాన్ని బట్టి ఇవ్వాల్సిన ఆహారపు పరిమాణాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ప్రారంభంలో అంటే చేపలు చిన్నవిగా ఉన్నప్పుడు ఎక్కువశాతం, రాను రాను అనగా పెరిగేకొద్దీ తక్కువ శాతం ఆహారమివ్వాలి. అంటే మొదట కొన్ని నెలు శరీర బరువులో 3 శాతం ఆహారమివ్వాలి. చివరి నెలలో మాత్రం 2 శాతం ఆహారమిస్తే సరిపోతుంది. అంటే శరీర పరిమాణం పెరిగే కొద్దీ ఇచ్చే ఆహారశాతం తగ్గిస్తూ పోవాలి.
ఉదాహరణకు ఒక హెక్టారుకు చెరువులో సుమారు 5 వేల చేపలు. ఒక్కొక్కటి సగటున 250 గ్రా. బరువుంటే ఈ చేపలకు శరీర బరువులో కనీసం 3 శాతం ఆహారమివ్వాలి. దీనికోసం రోజుకు ఇవ్వాల్సిన ఆహార పరిమాణాన్ని ఈ కింది విధంగా లెక్కించుకోవాలి.

రోజుకు ఇవ్వాల్సిన ఆహారం :

మొత్తం చేపల సంఖ్య x చేపల సగటు బరువు గ్రాముల్లో x 3
1000 x 100
= 5000 x 250x 3 = 375 కిలోలు
1000 x100

ఆహారం ఇచ్చే విధానం :

అనుబంధ ఆహారాన్ని నేరుగా చెరువు నీటిలో చల్లరాదు. తవుడు, నూనె తీసిన వేరుశనగ చెక్కను పొడిగా చేసి ఈ రెండింటి మిశ్రమాన్ని చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఖాళీ సిమెంటు సంచుల్లో నిర్ణయించుకున్న పరిమాణంలో నింపుకోవాలి. ఈ సంచలను నీటిలో మధ్యలో పాతిన వెదురు కర్రకు లేదా వేలాడదీసిన వైరు / తాడుకు నీటిలో మునిగేటట్లు అక్కడక్కడా కట్టాలి. హెక్టారుకు సుమారు 10-20 సంచు లు కట్టుకోవాలి. అలాగే ఇవ్వడానికి ప్రతిరోజు నిర్ణయించుకున్న ఆహారాన్ని అన్ని సంచుల్లో ఇంచుమించు సమానంగా వేసుకోవాలి.
చేపలకు ప్రతిరోజు ఇచ్చే ఆహారాన్ని ఒక నిర్ణీత స్థలంలో నిర్దిష్ట సమయంలో మాత్రమే ఇవ్వాలి. ఈ అనుబంధ ఆహారం ప్రతిరోజు ఉదయం అంటే సూర్యోదయం తరువాత ఇవ్వడం మంచిది. అలాగే ఆహారం ఇచ్చే ముందు అంతకు ముందు రోజు ఇచ్చిన ఖాళీ సంచులను తీసి శుభ్రపరచి ఆరబెట్టుకొని మరుసటి రోజుకు వినియోగించాలి.

గమనిక :

ఆహారపు సంచులను పాడైపోకుండా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అలాగే చెడిపోయిన, బూజుపట్టి ముక్కిన వాసన ఇచ్చే ఆహారాన్ని చేపలకు ఇవ్వరాదు. వాతావరణంలో ఉష్ణోగ్రత బాగా తగ్గిననప్పుడు డిసెంబర్, జనవరిలో నీటి గుణం చెడిపోయినప్పుడు చేపలకు ఇచ్చే ఈ అనుబంధ ఆహారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి.

చేపల పెరుగుదలను  గమనించడం :

చేపల పెరుగుదల, నీటి యాజమాన్యం లభించే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కనీసం 30 రోజులకొకసారి చెరువులో వలతో ట్రయిల్‌నెట్టింగ్‌ చేసి చేపల పెరుగుదలను గమనించాలి. చేప సగటు పెరుగుదలను అంచనా వేసి అందుకు తగిన ఆహార పరిమాణం నిర్ణయించుకోవాలి. అవసరమైనప్పుడు నిపుణులను చెరువు దగ్గరకు తీసుకువెళ్ళి చేపలను పట్టి చూపించి వారి సలహాలను , సూచలను పాటించాలి.

ఇతర యాజమాన్యం :

. పెంపక సమయంలో నీటి లోతు 5 -6 అడుగులు తగ్గకుండా చూడాలి.
. నీటిలో నాచు / ఇతర మొక్కలు పెరగకుండా జాగ్రత్తపడాలి.
. నీటిలో ప్రాణవాయువు లోటు లేకుండా చూసుకోవాలి. మబ్బు పట్టిన రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటప్పుడు అనుబంధ ఆహారాన్ని, ఎరువును నిలిపి వేయాలి.

Leave Your Comments

సేంద్రియ వ్యవసాయం

Previous article

మొక్కజొన్న గింజలు ఒలిచే యంత్ర పరికరాలు

Next article

You may also like