Farmers Protest Ends To Day ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దులో కొనసాగిన మహా ఉద్యమానికి తెర పడింది. సాగు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు ఎట్టకేలకు ఉద్యమం వీడేందుకు నిశ్చయించుకున్నారు. రైతు సంఘాల డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతు సంఘాలు తమ ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా నేడు అధికారికంగా తెలిపింది. వివరాలలోకి వెళితే .. (Farm Laws )
గత ఏడాది కేంద్రం మూడు సాగు చట్టాలను ప్రవేశపెట్టింది. రైతు సంక్షేమం కోసం మూడు సాగు చట్టాలను అమలు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయించింది. కాగా ఆ సాగు చట్టాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమానికి పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా ఉద్యమం దాదాపుగా ఏడాది పాటు జరిగింది. ఈ ఉద్యమంలో వందలాది మంది రైతులు ( 750) చనిపోయారు. వేల మంది రైతన్నలు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో పలు మార్లు కేంద్రం రైతు సంఘాలతో భేటీలు నిర్వహించినప్పటికీ చర్చలు ఫలించలేదు. దీంతో రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. కాగా రైతు అలుపెరగని ఉద్యమానికి ఎట్టకేలకు కేంద్రం మెడలు వంచాల్సి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కేంద్రం ముందు మరికొన్ని డిమాండ్లను ఉంచారు. దీనిపై ఇటీవల కాలంలో కేంద్రం చర్చలు జరిపింది. కిసాన్ మోర్ఛాతో జరిపిన చర్చలు ఫలించాయి. Farmers Protest Highlights
Farmers Protest Ends To Day సాగు చట్టాల అనంతరం రైతులు ఉద్యమాన్ని ముందుగు తీసుకెళ్లారు. డిమాండ్లను నిరవేర్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో నేడు కేంద్రం, కిసాన్ మోర్చా సమావేశమైంది. రైతు సంఘాల నేతలు రైతు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు.కాగా.. కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో రైతు సంఘాల నేతలు కూడా ఉంటారని లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆతర్వాత రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామమని వెల్లడించింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రైతు సంఘాలు సమావేశమై ఢిల్లీ సరిహద్దుల్ని ఖాళీ చేసేందుకు నిర్ణయించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన విరమిస్తున్నట్లు సంయుక్త SKM కిసాన్ మోర్చ వెల్లడించింది. రెండు రోజుల్లో ఢిల్లీ సరిహద్దులను పూర్తిగా ఖాళీ చేస్తామని ప్రకటించింది. Farmers agitation called off