వార్తలు

ఆధార్ ను పీఎం-కిసాన్ ఖాతాకు లింక్ చేశారా ?

0
PM Kisan Samman Nidhi Yojana

Farmers Must Link Their Account With Aadhaar to Get 10th Installment రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు కేంద్రం తీసుకున్న బృహత్తర నిర్ణయమే పీఎం కిసాన్ నిధి. ఈ పథకం కిందా ప్రతి ఏడాది రైతు ఖాతాల్లోకి రూ. 6,000 జమ అవుతాయి. అయితే ఈ మొత్తాన్ని కేంద్రం విడతల వారీగా అందజేస్తుంది. మూడు విడతలుగా విభజించి ఒక్కో విడతలో రూ. 2000 చొప్పున జమ చేస్తుంది. మొదటి విడత ఏప్రిల్-జూలై మధ్య, రెండో విడత ఆగస్టు-నవంబర్ మధ్య, మూడో విడత డిసెంబర్-మార్చి మధ్య అందజేస్తారు.

PM Kisan Samman Nidhi Yojana

కాగా.. పీఎం కిసాన్ యోజన 10వ విడత త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 7వ విడత అందించారు. దీని తర్వాత మరో రెండు వాయిదాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం10వ విడత రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ నెల గడువు ఉంది కాబట్టి ఎప్పుడైనా ఖాతాల్లోకి జమ అవ్వొచ్చు. Farmers Must Link Their Account With Aadhaar

PM Kisan Samman Nidhi Yojana

ఈ పథకం కోసం మీ ఆధార్ కార్డును పీఎం-కిసాన్ ఖాతాకు లింక్ చేయడం తప్పనిసరి. లేకుంటే ఖాతాకు సొమ్ము చేరదు. మీరు ఖాతాకు అనుసంధానం చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ కొనసాగాల్సి ఉంటుంది. ఈ మేరకు pmkisan.gov.in ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ తెరిచి పీఎం -కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి. హోమ్‌పేజీలో ‘e-KYC’ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, శోధనపై క్లిక్ చేయగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది.. ఆ తర్వాత ఆధార్ కార్డ్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దాన్ని నమోదు చేసిన తర్వాత, ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి. ఇప్పుడు OTPని నమోదు చేయాలి. తర్వాత మీ వివరాలు వెబ్ సైట్ లో కనిపిస్తాయి. PM Kisan Samman Nidhi Yojana

Leave Your Comments

దీని ధర తెలిస్తే షాక్ అవుతారు..

Previous article

రైతుబంధులోకి మరో 2 లక్షల రైతులు…

Next article

You may also like