FAO And ICAR Signs MoU With AP Govt రైతులను ఆర్థికంగా బలపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజషన్ ప్రతినిధులు మరియు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రతినిధులతో నేడు మంత్రి కన్నబాబు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… రైతు ముంగిటకే వ్యవసాయానికి కావాల్సిన అన్ని రకాల సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. తొలిసారిగా గ్రామ స్థాయిలో విత్తనాలను అందజేశామని, రాష్ట్రాన్ని వ్యవసాయ సంతులిత అభివృద్ధి ప్రాంతంగా చేసేందుకు సీఎం జగన్ నాయకత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి కన్నబాబు. ICAR
కాగా.. ఎఫ్ఏఓ మరియు ఐకార్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసుకున్న ఒప్పందం ద్వారా వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఏపీలో జరుగుతున్న వ్యవసాయం, పశుసంవర్ధక మరియు మత్స శాఖల విభాగాల్లోని పలు కీలక అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. FAO And ICAR
అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులను మరింత సానుకూలంగా మార్చేందుకు అంతర్జాతీయ సంస్థ ఎఫ్ ఏవో, ఐకార్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సాంకేతిక సహకార ప్రాజెక్టు కు ఒప్పందం కుదుర్చుకున్నారు. Minister Kannababu