భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అయితే పెట్టుబడులు పెరగడం దిగుబడులు తగ్గడంతో రైతులు తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ క్రమంలో సాగులో సాంకేతికత అందించినప్పుడే రైతులు నూతన ఒరవడిని సృష్టిస్తారని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఒడిస్సా రాష్ట్రం కటక్ లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఆర్ఆర్ఐ) శాస్త్రవేత్తలు అల్టర్నెట్ ఎనర్జీ లైట్ ట్రాప్ పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరం పంటలపైన దాడి చేసిన కీటకాలను గుర్తిస్తుంది. దీని ద్వారా కీటకాలను నాశనం చేయడానికి అవసరమైన నియంత్రణ రసాయనాల వాడటానికి వీలుపడుతుంది. ఈ పరికరానికి సంబంధించిన పేటెంట్ హక్కులని కూడా ఎన్ఆర్ఆర్ఐ సొంతం చేసుకుంది.
Leave Your Comments