వార్తలు

బచ్చలికూర మొక్కలతో ఈ – మైయిల్స్ ..

0

ఇంటర్నెట్ నుంచే కాదు మొక్కల నుంచి కూడా ఈమైయిల్స్ పంపుకోవచ్చు అంట.. మొక్కల ద్వారా ఈమైయిల్స్ ఎలా పంపుతారు అని అనుకుంటున్నారా..అదేలా అంటే కొత్త టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమంట. బచ్చలి ఆకు మొక్కల నుంచి విడుదలయ్యే కెమికల్ సిగ్నల్స్ ద్వారా ఈమైయిల్స్ పంపడం సాధ్యమేనని ఎంఐటి యూనివర్శిటికి చెందినా రీసెర్చర్లు కనిపెట్టారు. నానో టెక్నాలజీ ద్వారా ఇదే సాధ్యమేనని అంటున్నారు. బచ్చలి మొక్కల నుంచి విడుదలయ్యే రసాయనిక సంకేతాలను నానో టెక్నాలజీ అనుమతిస్తుందని, తద్వారా ఈమైయిల్స్ పంపడం చాలా ఈజీ అని రేసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ కొత్త టెక్నాలజీ సిస్టమ్ ద్వారా రాబోయే విపత్తు, కాలుష్యం వంటి విషయాలను ముందుగానే పసిగట్టి హెచ్చరిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఈ టెక్నాలజీ సహజ వనరులపై ఎలా పనిచేస్తుందో రీసెర్చర్లు వివరించారు. అధ్యయనంలో భాగంగా బచ్చలి మొక్కల వేళ్లను సేకరించారు. వాటిని మైక్రోస్కోపిక్ నానో సెన్సార్లను అమర్చారు. అలా బచ్చలి మొక్కల్లోని నైట్రోరారో మాటిక్స్ ను సులభంగా గుర్తించవచ్చు. ఈ తరహా కెమికల్స్ పేలుడు పదార్థాలు, పారిశ్రామిక రసాయనాల్లో ఎక్కువగా వాడుతుంటారు. నానోసెన్సార్లు ఈ కెమికల్స్ ను గుర్తించిన వెంటనే.. ఒక సిగ్నల్ పంపుతుందని అంటున్నారు. వాటికి అమర్చిన కెమెరా ద్వారా ఈమైయిల్ అలర్ట్ పంపుకోవచ్చునని చెబుతున్నారు. మనుషుల మధ్య కమ్యూనికేషన్ బదులుగా మొక్కల నుంచి కమ్యూనికేషన్ ప్రక్రియ ఎలా సాధ్యం అనే దిశగా అధ్యయనం కొనసాగింది. మనుషుల మాదిరిగానే మొక్కలు కూడా మనుషులతో కమ్యూనికేట్ అవుతాయని దీని ద్వారా నిరూపితమైందని రీసెర్చర్లు  అభిప్రాయపడుతున్నారు.

కంప్యూటర్ మాదిరిగానే ఈ బచ్చలి మొక్కలు నుంచి నానో టెక్నాలజీ సాయంతో కమ్యూనికేట్ కావడం సాధ్యమేనని చెబుతున్నారు. బచ్చలి మొక్కలు ఒక సైబోర్గ్స్ మాదిరిగా ఇంటర్ కనెక్ట్ అయ్యేందుకు సాయపతాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. అలాగే ఇలాంటి మొక్కల ఇంజినీరింగ్ ద్వారా పర్యావరణంలో సంభవించే అంటువ్యాధులు, ఇతర రసాయనిక ముప్పులను ఎలా గుర్తించాలో రక్షణ శాఖ అడ్వాన్స్ రీసెర్చ్ విభాగం లోతుగా అన్వేషిస్తోంది.

 

Leave Your Comments

మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు – నివారణ చర్యలు

Previous article

నువ్వులతో ఆరోగ్య లాభాలు..

Next article

You may also like