వార్తలు

సూక్ష్మ సేద్యంతో 192 పంటల్ని పండించవచ్చు

0
Dr V Praveen Rao

Dr V Praveen Rao

Dr V Praveen Rao భవిష్యత్తులో వ్యవసాయరంగం మరింత కీలకపాత్ర పోషించనుందని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం PJTSAU ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అభి ప్రాయపడ్డారు. పరిమిత వనరులు, అధునాతన టెక్నాలజీలతో పెరుగుతున్న జనాభాకి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల్ని పండించవలసిన అవసరముందన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీలతో కూడిన సాంకేతిక విప్లవం రానుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల 7వ ఎంఎస్.స్వామి నాథన్ అవార్డు పొందిన సందర్భంగా ప్రవీణ్ రావుకు రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల బోధన, బోధనేతర, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కళాశాల ఆడిటోరియంలో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు తన అనుభవాల్ని వీరందరితో పంచుకున్నారు. Dr V Praveen Rao

Dr V Praveen Rao

ప్రస్తుతం పోషకా హారభద్రత అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. అదేవిధంగా నీటి సమర్థ యాజమాన్యం తక్షణావసరమని వ్యాఖ్యానించారు. సూక్ష్మ సేద్యంతో సుమారు 192 పంటల్ని పండించవచ్చని వివరించారు. అదేవిధంగా ఏ రంగంలోనైనా రాణించడానికి స్పష్టతతో కూడిన కమ్యూనికేషన్ అత్యవసరమని అన్నారు. ఏ వృత్తిలోనైనా విజయం సాధించాలంటే అంకితభావంతో పనిచే యడంతోపాటు రిస్క్ తీసుకొనే మనస్తత్వం ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కిల్స్ ప్రతి ఒక్కరికీ అవసరమని వాటిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవలసిన అవసరముందని ప్రవీణ్ రావు సూచించారు. కళాశాల అసోసియేట్ డీన్ సి.నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, బోధన, బోధ నేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 7th Dr MS Swaminathan Award

Dr V Praveen Rao

Leave Your Comments

రికార్డ్ స్థాయిలో అస్సాం టీ ధర…

Previous article

రాష్ట్రంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ

Next article

You may also like