వార్తలువ్యవసాయ వాణిజ్యం

పత్తి కొనగోళ్ళ పై జిల్లాకో కాల్ సెంటర్..తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి..సింగిరెడ్డి..

0

తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు మంత్రుల నివాస సముదాయంలో అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం జరిపారు.

రైతుల ఫిర్యాదు, సూచలను, సలహాలు స్వీకరించి వెంటనే తగు విధంగా కొనుగోళ్ళుకు ఉపక్రమించాలని మంత్రి ఆదేశించారు. మిల్లర్లు వెంటనే కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేయడానికి వచ్చిన పత్తి ఎట్టి పరిస్థితుల్లో అకాల వర్షాలకు తడిసిపోయే పరిస్థితి ఉండకూడదని అధికారులను అప్రమత్తం చేశారు. పత్తి నిల్వలను కాపాడి రైతుకు భద్రత కల్పించడంలో మార్కెటింగ్‌, వ్యవసాయ, పోలీస్‌, రవాణా, అగ్నిమాపక, తూనికలు కొలతల శాఖ సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

ఈ సందర్భంగా 300 జిన్నింగ్‌ మిల్లులు , 9 మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిసిఐ సంక్షిబ్దత వ్యక్తం చేసింది. ఇక కొనుగోలు రేటు విషయానికి వస్తే 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ. 5825, 9 శాతానికి రూ. 5766.75 పైసలు , 10 శాతానికి రూ. 5708.50 పైసలు , 11 శాతానికి 5650.25 పైసలు , 12 శాతానికి రూ. 5582 గా ధరను నిర్ణయించినట్లు తెలిపారు.

సిసిఐ సూచించిన 8 శాతం తేమ కన్నా తక్కువగా 6 శాతం తేమ ఉంటే మద్ధతు ధర రూ. 5825 అదనంగా రూ. 116.50 పైసలు , అదనంగా 7 శాతం తేమ ఉంటే రూ. 58.25 పైసలు ఇవ్వడం జరుగుతుందని అధికారులు వివరించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద వెబ్‌ కెమేరాలు , ఫింగర్‌ ప్రింట్‌ స్కేనర్లు, తేమ యంత్రాలు , ఎక్ట్రానిక్‌ కాంటాలు , ఆపరేటర్లను సిద్దంగా ఉంచుకోవాలని జాగ్రత్తలు సూచించారు.

తూనికలు కొలతల శాఖతో అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల వారీగా పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గాను వ్యవసాయ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం ఎఇఒలు , ఎఒలు, ఇతర అధికారుల సమన్వయంతో టోకెన్లను జారీ చేసి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజులు తరబడి వేచి చూడకుండా వెంటనే వెళ్ళిపోయేలా చూడాని ఆదేశించారు.

పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు , నిర్ధేశించిన నాణ్యతా ప్రమాణాలు రైతుకు చేరేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలని మంత్రి అధికారును ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా సమన్వయ కమిటీలు పత్తి కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. పత్తి కొనుగోళ్ళపై మంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మార్కెటింగ్‌ సంచాలకులు లక్ష్మీభాయి, అదనపు సంచాలకులు రవికుమార్‌, సంయుక్త సంచాలకులు శ్రీనివాస్‌ మరియు అనేక మంది అధికారులు పాల్గొన్నారు.

Leave Your Comments

ఏరువాకకు స్ఫూర్తి,నేటి తరానికి మార్గ దర్శి, రైతు నేత రంగయ్య తాత, రైతుసాథికారతకు ప్రతీక…

Next article

You may also like