తెగులును నివారించేందుకు పిచికారీ చేసిన మందు పంటనే నాశనం చేసింది. ఆ రైతుకు అంతులేని ఆవేదనను మిగిల్చింది. మండల పరిధిలోని వీరాపురం గ్రామానికి చెందిన బిజ్జ స్వామి ఆయన తన రెండు ఎకరాలలో మిర్చి తోట సాగు చేశారు. ఇటీవల తన మిర్చి తోటలో ఓ వ్యాపారి నుంచి పురుగుల మందు తీసుకొచ్చి తన రెండు ఎకరాలలో పిచికారీ చేశారు. రెండు, మూడు రోజుల తరువాత నుంచి తోటలో చెట్లు ఆకులు రాలాయి. మొక్కలన్నీ గిడసబారాయి. దీంతో రైతు లబోదిబోమంటున్నాడు. కాగా వ్యాపారి తనకు నకిలీ మందు అంటగట్టాడని, అందువల్లే మిరప తోట ఎండిపోయిందని కన్నీటి పర్యంమవుతున్నాడు.
నాకు న్యాయం చేయాలి.
రెండెకరాల్లో మిర్చి సాగు చేశాను. రూ. రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇటీవల తోటలో ఆకులు ముడత వచ్చాయి. దీని నివారణకు గానూ ఓ వ్యాపారి ఇచ్చిన మందును మోతాదు ప్రకారం పిచికారీ చేశాను. రెండు, మూడు రోజుల తరువాత నుంచి తోటలో చెట్లకు వున్నా ఆకులు రాలాయి. మొక్కలన్నీ గిడసబారాయి. అధికారులు నాకు తగిన న్యాయం చేయాలి. నకిలీ మందులు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి అని బిజ్జ స్వామి వీరాపురం రైతు తెలిపారు. .