వార్తలు

అరకు కాఫీకి దేశీయంగా మంచి గుర్తింపు..

0

అరకు కాఫీ దేశీయంగా రంగు, రుచి, నాణ్యతలో మంచి గుర్తింపు పొందింది. కాఫీ ఉత్పత్తుల మార్కెటింగ్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఒకప్పుడు ఏజెన్సీలో దళారులే కాఫీ గింజలు కొనుగోలు చేసేవారు. మారుతున్న పరిస్థితులతోపాటు జాతీయంగా కాఫీకి పెరుగుతున్న ఆదరణతో ప్రభుత్వంతో పాటు పేరొందిన ప్రైవేట్ సంస్థలూ కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. సంస్థల మధ్య పోటీ పెరగడంతో కరోనా వంటి కష్టకాలంలోనూ ఆశాజనకమైన ధర పలుకుతుండడంతో కాఫీ రైతులకు ఊరటనిస్తోంది. ఏజెన్సీ వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఏటా పది వేల టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. గత అయిదేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రభుత్వరంగ సంస్థగా పేరొందిన జీసీసీతోపాటు నాంది, టాటా, ఇతర ప్రైవేటు సంస్థలు కాఫీ కొనుగోలు చేస్తున్నాయి. ఏటా ఆయా సంస్థలు మూడు నుంచి నాలుగు వేల టన్నుల వరకు రైతుల వద్ద సరకు తీసుకుంటున్నాయి. జీసీసీ ఈ ఏడాది పార్చెమెంట్ కు కేజీ ధర రూ. 143 నిర్ణయించగా.. టాటాతో పాటు ప్రైవేటు, స్వచ్చంధ సంస్థలు కేజీ రూ. 170 నుంచి రూ. 190 వరకు చెల్లిస్తూ కాఫీ గింజలను సేకరిస్తున్నాయి. కాఫీ పండ్లు కేజీ రూ. 27 నుంచి రూ. 40 వరకు ధర పలుకుతున్నాయి. వెలుగు ఆధ్యర్యంలో ఏర్పాటైన చింతపల్లి అగ్రికల్చర్, అలైడ్ ప్రోడక్ట్స్ మాక్స్ లిమిటెడ్ నుంచి 10వేల కేజీలు కొనేందుకు టాటా సంస్థ ముందుకొచ్చింది. అరబికా పార్చెమెంట్ రకం కాఫీ కేజీకి రూ. 193 ధర కేటాయించింది. ఐటీడీఏ ఆధ్యర్యంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన చింతపల్లి గిరిజన ఆర్గానిక్ కాఫీ సొసైటీ 650 టన్నుల కాఫీ పండ్లను రైతుల నుంచి సేకరించింది. కేజీకి రూ. 27 చొప్పున చెల్లింపులు చేసింది. గిరిజన సహకార సంస్థ కేజీ పార్చెమెంట్ ధర రూ.143, చెర్రీ ధర రూ. 63 గా ప్రకటించింది. ఏజెన్సీ వ్యాప్తంగా రెండు వేల టన్నుల వరకు కాఫీ గింజలను సేకరించేందుకు చర్యలు చేపట్టింది. నాంది, మన్య తోరణం సంస్థలూ రైతుల నుంచి కాఫీ గింజలు కొనుగోలు చేస్తున్నాయి.
గత ఏడాది తో పోల్చితే ఈ ఏడాది కాపీకీ ధరలు ఆశాజనకంగా వున్నాయి. ఐటీడీఏ ఆధ్యర్యంలో కాఫీ సాగు విస్తరణ, రైతు సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి. కాఫీ గింజలు శుద్ధి చేసి విక్రయించిన తర్వాత చెల్లింపులు చేస్తున్నారు. జీసీసీతో కలిసి రైతులకు ఆదాయం పెరిగేలా ఐటీడీఏ చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

Leave Your Comments

హైడ్రోపోనిక్స్ విధానంతో ఉద్యాన పంటల సాగు..

Previous article

రైతులు కోళ్ల పెంపకంలో వేల ఆదాయం పొందవచ్చు..

Next article

You may also like