Darjeeling tea production sinks to record low in 2021 ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ రకాల్లో ఒకటైన డార్జిలింగ్ టీ ఉత్పత్తి 2021లో 6.5 మిలియన్ కిలోలకు తగ్గిపోయింది, దీనికి వాతావరణ మార్పు, ఉద్యానవనాల మూసివేత, తేయాకు కార్మికులు అధిక స్థాయిలో గైర్హాజరు కావడం తదితర కారణాలుగా చెప్తున్నారు. అదేవిధంగా 2017లో కొండల్లో జరిగిన ఆందోళనల కారణంగా ఎగుమతి మార్కెట్‌లను కోల్పోవడం మరియు దేశీయ విపణిలో డార్జిలింగ్ టీని ప్రోత్సహించకపోవడంతో పతనానికి దారితీసింది. అయితే ప్రభుత్వం పునరుద్ధరణ ప్యాకేజీని తీసుకురాకపోతే, హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్ నుండి వచ్చిన టీల మాదిరిగానే భారతదేశ తేయాకు పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న డార్జిలింగ్ టీ కూడా చరిత్రలో నిలిచిపోతుందని ప్లాంటర్లు భయపడుతున్నారు. ప్రస్తుతం డార్జిలింగ్ టీ ఉత్పత్తి 10 మిలియన్ కిలోల స్థాయి నుండి ఆరు మిలియన్ కిలోలకు చేరుకుంది.
క్షీణతపై ప్రముఖ వ్యాపారి మాట్లాడుతూ .. డార్జిలింగ్‌లో ఉత్పత్తి 2017 నుండి తగ్గిపోతోంది. 10 మిలియన్ కిలోల స్థాయి నుండి ఆరు మిలియన్ కిలోలకు చేరుకుంది. పనిచేస్తున్న 87 తేయాకు తోటల్లో నాణ్యత కూడా దిగజారింది. డార్జిలింగ్‌లో ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.700కి చేరుకుంది. ఇక అంతర్జాతీయ మరియు స్థానిక మార్కెట్‌లలో ధరలు లాభసాటిగా లేవు. అలాగే, ప్రభుత్వ సహాయం అవసరం అని అన్నారు.
కాగా.. డార్జిలింగ్ టీ… Darjeeling tea దీనిని ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకి విశేష ఆదరణ ఉంటుంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ కొండల్లో ఎటు చూసినా వేలాది ఎకరాల్లో తేయాకు తోటలే కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో 87 టీ ఎస్టేట్లలో విభిన్న రుచుల తేనీటిని అందించడంలో దేనికదే సాటి. కాగా.. భారత్‌లో ఉత్పత్తయ్యే తేయాకులో అత్యంత ఖరీదైనది ఇదే. 2014లో కిలో దాదాపు లక్షా 30 వేల రూపాయలు పలికిందంటే దీని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. Darjeeling tea production