వార్తలు

అస్పరాగస్ మొక్కల సాగు విధానం..

0

అస్పరాగస్ అనేది బహువార్షిక మొక్క. సువాసనతో కూడిన తెలుపు నుంచి గులాబీ రంగు పూలనిస్తాయి. దుంపలు, విత్తనాలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. 

రకాలు: అస్పరాగస్ డెన్ సిఫ్లోరన్, స్పిన్  గౌరి, అస్పరాగస్ అంబెట్లెటస్, అస్పరాగస్ డెన్ సిఫ్లోరస్ మేయర్, అస్పరాగస్ సియేసిటస్ పిరమిడల్స్, అస్పరాగస్ ఫలకేటస్ ముఖ్యరకాలు.  

నాటడం: చివరి దుక్కిలో ఎకరాకు 20 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. బోదెలు తయారుచేసి మొక్కలను నాటాలి. 2 అడుగుల వెడల్పు, అడుగున్నర ఎత్తులో బెడ్స్ తయారు చేయాలి. రెండు బెడ్ల మధ్య అడుగు వెడల్పు దారి వదలాలి. బెడ్ కు ఇరువైపుల మొక్కకు మొక్కకు 45 సెం.మీ వరుసల మధ్య 30 సెం.మీ దూరం ఉండేలా నాటుకోవాలి. 3500 నుంచి 5000 మొక్కలకు తగ్గకుండా నాటుకోవాలి. 

ఎరువులు: నాటిన నెలకు బెడ్స్ లో ఒకసారి కలుపుతీసి మొక్కకు 50 గ్రా. చొప్పున ఎరువు మిశ్రమాన్ని (50 కి. యూరియా + 100 కి. సూపర్ ఫాస్ఫిట్ + 30 కి. పొటాష్) మొక్క దగ్గర వేయాలి. ఈ ఎరువు మిశ్రమాన్ని నెలకోసారి 75 గ్రా. వరకు మొక్క వయస్సు పెరిగే కొద్ది వేయాలి. ఆరునెలలకోసారి పశువుల ఎరువు ఎకరాకు 3-5 టన్నుల వరకు సాళ్ళ మధ్యలో వేస్తే మొక్కలు త్వరగా పెరుగుతాయి. 

కొమ్మలకోత: సూదిలాగా ఉండే ఆకులు ముదురాకు పచ్చరంగులోకి మారాక కొమ్మలను కత్తిరించుకొని మార్కెట్ కు తరలించాలి. కొమ్మలు మొక్కపై 20-30 రోజుల వరకు ఉంటాయి. ఒక్కో మొక్క కనీసం 150-200 కొమ్మలను ఇస్తుంది.  

Leave Your Comments

ఎండాకాలంలో డీహైడ్రేట్ కాకుండా తీసుకోవలసిన పండ్లు..

Previous article

పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like