కరోనా దెబ్బకు సామాన్యుడి జీవితం అయోమయంలో పడింది. పైగా అన్ని వస్తువులపై ప్రభుత్వాలు ధరలు పెంచి మరింత కష్టాల్లోకి నెట్టేసింది. నేడు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యుడికి ఊరట అనే చెప్పాలి. విపరీతంగా పెరిగిన నూనెధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 ధరలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. దీంతో గత కొన్నిరోజులుగా ధరల పెరుగుదలతో సతమతమైన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది. కాగా ఇటీవల ఇంధన ధరలపై కూడా ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. ఇంధన ధరల తగ్గుదుల ఇతర ధరలపై కూడా ప్రభావం చూపుతుందని, కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని వస్తువుల ధరల్లోనూ తగ్గుదుల ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
#CookingoilpricesReduced #Palmoil ##Cookingoil #govt #goodnews #agriculturenews #eruvaaka