CM YS Jagan Review Meeting On Paddy Procurement రైతులకు వంద శాతం మద్దతు ధర కల్పిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి (CM YS Jagan). ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫిరెన్స్ లో సీఎం మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలులో జాప్యం కరగకూడదన్నారు. ధాన్యం కొనుగోలులో వారికి మద్దతు ధర అందించేందుకు మిల్లర్ల పాత్రను తొలగించామని సీఎం చెప్పారు. ఇక ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు రైతులతో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలని సీఎం అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అన్యాయం జరగకూడదని సీఎం అధికారుల్ని ఆదేశించారు. CM YS Jagan Review Meeting
ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకోవాలని, అదేవిధంగా రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించాలని సీఎం సూచించారు. వీలైనన్నీ ఆర్బీకే సెంటర్లను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పంటల ధరలపై పర్యవేక్షణకు సీఎం యాప్‌ను తెచ్చామని, 1,100 మల్టీ పర్పస్ గోడౌన్లు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటిపై కలెక్టర్లు దృష్టి సారించాలని గోడౌన్ల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫిరెన్స్ లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా అంతా ప్రభుత్వం హయాంలో జరగాలని ఇదే మన ముందున్న లక్ష్యమని సీఎం చెప్పారు. AP Paddy Procurement Updates
ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు సేకరణలపై అధికారులు ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్ష చేసుకోవాలని సీఎం సూచించారు. అదేవిధంగా కొనుగోళ్లలో అవసరమైన కూలీలను ఆర్బీకే పరిధిలో ఉంచుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వినూత్న మార్పుల కోసం అధికారులు ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని, ఏది ఏమైనప్పటికీ ధాన్యం కొనుగోళ్లలో గోల్ మాల్ జరగకూడదని అధికారుల్ని హెచ్చరించారు సీఎం వైఎస్ జగన్. CM Jagan Latest News