CM YS Jagan Releases Third Tranche Of Rythu Bharosa రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్ కిందా రైతులకు కేంద్రం ప్రభుత్వం పెట్టుబడి కిందా విడతలవారీగా రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతుల్ని ఆదుకునేందుకు రైతు భరోసా పథకాలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఏపీ రైతు ఖాతాలోకి వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం అందించారు.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి CM YS Jagan చేతుల మీదుగా బటన్ నొక్కి రైతుభరోసా కిందా రైతు ఖాతాలోకి డబ్బు జమ చేశారు. ఈ మేరకు అయన వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం అందించారు. మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. భరోసా-పీఎం కిసాన్ పథకం గత మూడేళ్లుగా అమలవుతోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు.తాజాగా మూడో విడత సొమ్ము కూడా రైతు ఖాతాలోకి జమ చేశారు. కాగా.. ఇప్పటివరకు మూడు విడతలలో భాగంగా.. 2021-22లో రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం రైతులకు అందింది. Third Tranche Of Rythu Bharosa
ఈ పథకం పూర్తి వివరాలు గమనిస్తే.. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500 పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. మొదటి విడతలో ఖరీఫ్ పంట సమయం అనగా మే నెలలో రూ. 7,500 జమ చేస్తుంది. ఇక రెండో విడతగా అక్టోబర్ నెల ముగిసేలోపే అనగా ఖరీఫ్ పంట కోత సమయంలో 4 వేలు రైతులకు అందిస్తుంది. ఇక మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ అనగా జనవరి నెలలో రూ. 2వేలు చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది.మరో విశేషం ఏంటంటే.. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటుగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున రైతులకు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తుంది.
అయితే రైతు భరోసా డబ్బు జమ తమ ఖాతాలో జమ అయిందో లేదో ఇలా తెలుసుకోండి. వైఎస్సార్ రైతు భరోసా వెబ్‌సైట్ (https://ysrrythubharosa.ap.gov.in/)లోకి వెళ్ళి.. ఆ తర్వాత అక్కడ కనిపించే నో యువర్ రైతుభరోసా స్టేటస్ (Know your Rythu Bharosa Status) మీద క్లిక్ చేయాలి. అక్కడ సంబంధిత రైతు ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేస్తే డబ్బులు అకౌంట్‌లో జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇక ఈ పథకానికి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు ఎదురైతే.. 1902 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఈ నంబర్ ఉంటుంది. లేక గ్రామ, వార్డు వాలంటీర్‌నైనా సంప్రదించవచ్చు. Andhrapradesh Agriculture Schemes