ఆంధ్రప్రదేశ్ లో నష్టం చవిచూసిన రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి శుభవార్త అందించారు. 2 నెలల క్రితం గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా వారి ఖాతాల్లో రూ.22 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెల్లడించారు.
ఏపీలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. పంట నష్టం, ప్రకృతి విపత్తులు, అతివృష్టి..కారణమేదైనా రైతులు నష్టపోతే వారిని ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. నేడు సంబంధిక అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.తమ ప్రభుత్వం అధికారలోంకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ కోసం రూ.35వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రైతు భరోసా పథకం ద్వారా రూ.18,777 కోట్లు అందించినట్లు జగన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి రైతు ఇబ్బందిపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రోడ్డుమీద పడుతుందని సీఎం జగన్ తెలిపారు
అదేవిధంగా రైతులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ఎటువంటి విపత్తుల సమయంలోనైనా ప్రతిఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తుపానులు, వరదలు, కరువు ఏవి వచ్చినా సరే రైతు నష్టపోయే పరిస్థితి రాకూడదని, ఒక వేళ వచ్చినా అదే సీజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు.
#CMYSJagan #inputsubsidy #CropDamageFarmers #apgovt #apfarmers #agriculture #eruvaakadailynews