AP Rains Jagan Aerial Survey: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. ఇక కొద్దిరోజులుగా ఏపీలో భారీ వర్షపాతం నమోదు అవ్వడంతో అపార నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాలు నీటమునిగాయి. పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు. ఇల్లులు నీటిమట్టం అయ్యాయి. పశువులు సైతం వరదల్లో కొట్టుకపోయాయి. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ( CM YS Jagan Aerial Survey of Flood Hit Region )
Rains In AP : ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీగా నష్టం సంభవించింది. వరద సహాయక చర్చలపై ఎప్పటికపుడు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం జగన్ ఈ రోజు నేరుగా, ఆ జిల్లాలను పరిశీలిస్తున్నారు. సీఎం ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో జరిగిన నష్టాన్ని, ముంపు అయిన ప్రాంతాలను సీఎం ప్రత్యేక హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్నారు. సీఎం ఏరియల్ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు సీఎం వైఎస్ జగన్, తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్ష నిర్వహించారు . ఇక ఏపీలోని వరద పరిస్థితులపై సీఎం జగన్‌తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.
Also Read : సాగు చట్టాల రద్దుపై యూఎస్ స్పందన ఇది !