యాసంగి వరి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అస్సలు సఖ్యత కుదరడం లేదు. రెండు ప్రభుత్వాల ధోరణి విభిన్నంగా ఉంది. దీంతో రైతులు అయోమయంలో పడిపోతున్నారు. ఎవరి మాట వినాలో పాలుపోవడం లేదు వారికి. దీంతో తెలంగాణాలో అధికారపార్టీ కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. అందులో భాగంగా ధర్నాలు మొదలుపెట్టింది. అయితే తాజాగా నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ఏటా పంట ఉత్పత్తి పెరుగుతుంది కానీ ఆ పంటను సేకరించే మొత్తం పెరగట్లేదు అంటూ సీఎం కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు 2021-22 ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అవసరానికి మించి ఆహార ధాన్యాలు పండిస్తోంది అని లేఖలో ప్రస్తావించారు.
ధాన్యం సేకరణ లో నిర్ధిష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయెల్ ను సెప్టెంబర్ 25, 26 తారీఖుల్లో నేనే స్వయంగా వెల్లి కలిసాను అని. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్దారించాలని నేను విజ్జప్తి చేశాను. కేంద్ర మంత్రికి విజ్జప్తి చేసి 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదు, ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు. ఈ నేపథ్యంలో….2020- 21 ఎండాకాలం సీజన్లో సేకరించకుండా మిగిలి ఉంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని డిమాండ్ చేశారు.
40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమనే నిబంధనను మరింతగా పెంచి, జాబ్ రాష్ట్రంలో మాదిరి తెలంగాణలో కూడా ఈ 2021 -22 వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యాన్ని సేకరించాలి. వచ్చే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్దారించాలి. ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలి.’అని సీఎం కేసీఆర్ పీఎం మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించారు.
Also Read : సాగు చట్టాలపై బీజేపీ ఎంపీ మోడీకి లేఖ