CM KCR To Meet PM Modi On Paddy Procurement. తెలంగాణాలో వరి ధాన్యం కొనుగోలు అంశంలో తెరాస ప్రభుత్వం, భాజపా ప్రభుత్వం ఢీ అంటే ఢీ అంటున్నాయి. కేంద్రమే వరి ధాన్యం కొనుగోలు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా… ముందు రాష్ట్ర ప్రభుత్వం కొనాలని ఆ తర్వాత మేము ఎంత మేర కొనాలో చూస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని సీఎం కెసిఆర్ కేంద్రాన్నికోరుతున్నారు. అందులో భాగంగా తెలంగాణాలో యాసంగి పంట కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా మహా ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని కీలక నేతలతో సీఎం కెసిఆర్ మహా ధర్నాలో పాల్గొన్నారు. కాగా ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చెయ్యాలని భావించిన అధికారపక్షం ఢిల్లీలోనే తేల్చుకుంటామని సిద్ధపడ్డారు. ఈ మేరకు సీఎం కెసిఆర్, మంత్రులు, సంబంధిక అధికారులు హస్తినకు చేరుకున్నారు.

CM KCR To Meet PM Modi On Paddy Procurement
telangana latest updates. వరి కొనుగోలుపై స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ఢీల్లీలోనే ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందులోభాగంగా ప్రధాని మోడీని కలవాలని నిశ్చయించుకున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ వచ్చేంతవరకు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు ముఖ్యమంత్రి. మూడు, నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ధాన్యం సేకరణపై స్పష్టత, కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు, రాష్ట్ర విభజన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో సమావేశమై చర్చించే అవకాశాలున్నాయి. Paddy Procurement issue in telangana

CM KCR To Meet PM Modi
CM KCR To Meet PM Modi.. ఇటీవలే ప్రధాని మోడీ మూడు సాగు చట్టాలను రద్దు చేశారు. రైతుల మేలు కోసమే సాగు చట్టాలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, అయితే ఒక వర్గం రైతుల్ని మెప్పించలేకపోయామని, ఈ నేపథ్యంలో సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా పీఎం మోడీ చారిత్రాత్మక ప్రకటన చేశారు. ఈ సమయంలో తెలంగాణ నుంచి ప్రధాని టేబుల్ వద్దకు తెలంగాణ వరి కోనుగోలు అంశం చేరడం చర్చనీయాంశంగా మారింది. మరి కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన సీఎం కేసీఆర్ పర్యటన ఎలా ముగుస్తుందో చూడాలి.

Telangana Farmers