CM KCR Meeting With District Collectors వరి సేకరణ లేని కారణంగా ఆ విషయాన్ని రైతుల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు CM KCR పునరుద్ఘాటించారు. యాసంగి వడ్లు కొనే విషయంలో గత నెల రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వడ్లు కొనే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టంగా తేల్చి చెప్పింది. కానీ వడ్లు సేకరించాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ సాక్షిగా తెరాస ఎంపీలు గళం విప్పి వడ్లు సేకరించాలని నినాదాలు చేసినా కేంద్రం నుండి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో వడ్ల సేకరణ ఉండదని, కొనుగోలు కేంద్రాలు పెట్టబోమని తెలంగాణ సర్కారు చెప్పింది. అయితే ఆ వడ్లు ఎందుకు సేకరించట్లేదో రైతులకు అర్థమయ్యేలా బలంగా చెప్పాలని నిర్ణయించారు. అందులో భాగంగా సీఎం కెసిఆర్ కలెక్టర్లతో భేటీ నిర్వహించారు.
యాసంగి పంటలో కిలో వడ్లు కూడా కొనుగోలు చేసే అవకాశం లేదన్నారు సీఎం కేసీఆర్.ఈ మేరకు ధాన్యం సేకరించే కేంద్రాలు ఉండవన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. Paddy Procure Issue
రాబోయే వర్షాకాలం పంటపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా వ్యవసాయ అధికారుల్ని ఆదేశించారు సీఎం. వానాకాలం లో ప్రధానంగా పత్తి., వరి., కంది సాగు పై దృష్టి సారించాలని కలెక్టర్ల ను, వ్యవసాయ అధికారులను కేసిఆర్ ఆదేశించారు. రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. CM KCR Meeting With District Collectors