CM KCR inspects minim and groundnut crop ఆరుతడి పంటలే వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. వ్యవసాయంతో కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారు కొందరు. ఆరుతడి పంటలు వేయడంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందని అన్నారు సీఎం కేసీఆర్. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామి రెడ్డి ఇటీవలే మృతి చెందారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు సీఎం కెసిఆర్ గద్వాల పర్యటన చేపట్టారు. అనంతరం సీఎం కెసిఆర్ తిరుగు ప్రయాణంలో పెబ్బెర్ మండలం రంగాపూర్ లో, కొత్తకోట మండలం విలయం కొండలో ఆగి రైతులతో ముచ్చటించారు. జాతీయ రహదారి 44 పక్కన ఉన్న పంట పొలాలను సీఎం పరిశీలించారు. మినుము పంట సాగు చేస్తున్న మహేశ్వర్ రెడ్డి, వేరుశనగ వేసిన రాములుతో కేసీఆర్ మాట్లాడి, పలు విషయాలను చర్చించారు. సీఎం కేసీఆర్ వెంట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.
యాసంగిలో పంట గురించి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కొనుగోలు చేయమని కేంద్రం తేల్చి చెప్పింది. ఇక పంటను కేంద్రం కొనుగోలు చేయాలనీ, రాష్ట్రం కొనుగోలు చేసి ఎక్కడ నిల్వ ఉంచాలని ప్రశ్నిస్తుంది. నిల్వ కేంద్రాలు కేంద్రప్రభుత్వ అధీనంలో ఉంటాయని, యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. అయితే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లోనూ కేంద్రం స్పష్టం చేసింది. యాసంగి వడ్లు కొనే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలని రైతులకు సూచిస్తుంది.
CM KCR Gadwal Tour, MLA Bandla Kishna Mohana Reddy, Yasangi