రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి రూ. 18 వేలు పశ్చిమ బెంగాల్ లోని రైతులకి అందిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. రైతులకి అండగా ఉండడానికి, చేయూతనివ్వడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్.
ఈ పథకం లో రైతులకు ప్రతి ఏడాది రూ. 6,000 మూడు విడతల్లో అందుతున్న సంగతి తెలిసినదే . ప్రస్తుతం 8వ విడత డబ్బులు అందించేందుకు కూడా రెడీ అవుతోంది. ఇలా అన్ని రాష్ట్రాల వాళ్లకి రూ. 2 వేలు లభిస్తే ఇక్కడ మాత్రం ఒకేసారి రూ. 18,000 లభించనున్నాయి. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ లో పీఎం కిసాన్ స్కీమ్ అమలులో లేదు.
అయితే ఈ స్కీమ్ ని ఇప్పుడు అమలు చేస్తారని మమత ప్రకటించారు. అమిత్ షా కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్కీమ్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి పంపిస్తున్నట్టు చెప్పడం జరిగింది. గత రెండేళ్లలోని డబ్బులు రూ. 12 వేలు, ఈ ఏడాది రూ. 6 వేలు మొత్తం డబ్బులు కలిపి ఒక్కసారే ఇస్తామని అన్నారు. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే.. రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రూ. 18 వేలు వచ్చి చేరతాయి.