పాత పద్ధతులను అనుసరిస్తూ నష్టపోయిన రైతన్నలు కొత్తపంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్గంలో సాగుతూ వినూత్నంగా బ్రకోలీ పంటను సాగు చేస్తున్నారు. సి. బెళగల్ మండలం గొల్లలదొడ్డికి చెందిన పది మంది రైతులు 12 ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు. ఇటలీ దేశానికి చెందిన ఈ పంట విత్తనాలను బెంగుళూరు నుంచి తెచ్చి ఇక్కడ సాగు చేసినట్లు తెలిపారు. బ్రకోలీలో క్యాన్సర్ నివారణతోపాటు విటమిన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటుందని తెలిపారు. ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి పెట్టామన్నారు. 70 రోజుల నుంచి 90 రోజుల్లో పంట చేతికొస్తుందని, ఎకరాకు ఎనిమిది టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు.
బెంగుళూరులో దీని ధర కిలో రూ.350 వరకు పలుకుతోందని దళారులు మాత్రం రూ.40 కంటే ఎక్కువ ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. ముందుగా కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకుని పువ్వు అరకిలోకు మించకుండా కోసిన తర్వాత వాటిని ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి శీతల గదుల్లో భద్రపరుచుకుంటే ఆశించిన ధర వస్తుంది.
బ్రకోలీ పంట సాగు..లాభాల బాటలో
Leave Your Comments