వార్తలు

బీపీటీ – 2841 రైస్ ప్రయోగాత్మక సాగులో లింగాపూర్ రైతు సక్సెస్..

0

బీపీటీ – 2841 రకం బహుళ ప్రయోజనకారిగా మారింది. అధిక పోషక విలువలతో దీర్ఘకాలిక రోగులకు ఎంతో మేలు చేస్తుండగా సాగు చేసిన రైతులకు అధిక లాభాలు అందిస్తున్నది. మార్కెట్ లో కిలో రూ. 250 – 300 ధర పలుకుతుండడమే ఈ బియ్యానికి ఉన్న డిమాండ్ కు నిదర్శనంగా నిలుస్తున్నది. బ్లాక్ రైస్ – 2841 రకాన్ని గుంటూరు జిల్లా బాపట్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మిగతా రకాలతో పోలిస్తే పైరు కాస్త ఎత్తుగా పెరుగుతుంది. పిలకలు ఎక్కువ వస్తాయి. తెగుళ్లను తట్టుకుంటుంది. మొదలు దృఢంగా ఉంటుంది. ఈదురు గాలులకు పైరు పడిపోయే అవకాశాలు తక్కువ. ఎకరానికి 35 – 40 సంచుల దిగుబడి వస్తుంది. 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. వానాకాలం, యాసంగి రెండు సీజన్ల లో పంట వేయచ్చు. ఇతర రకాల మాదిరిగానే సాగు చేసుకోవచ్చు. సాధారణ రకాల కంటే రెండు, మూడు రెట్లు అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
శ్రీనివాస్ అనే రైతుకు 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాధారణ బీపీటీతో పాటు జేజేలు – 384 సాగు చేసినం. కొద్దిగా బీపీటీ – 2841 వేసినం. యూ ట్యూబ్ లో చూసి బ్లాక్ రైస్ గురించి తెలుసుకున్నారు. ప్రయోగాత్మక పంటలు పండించే కాసంపల్లికి చెందిన మల్లారెడ్డి దగ్గర 5 – 6 కిలోల ఈ నల్ల వరి విత్తనాలు తెచ్చారు. 10 బస్తాల దిగుబడి వచ్చింది. కంపోస్ట్ ఎరువులు చల్లినం. దిగుబడి ఎట్ల ఉంటదో అని ఒకసారి యూరియా చల్లిన. రసాయన మందులు ఏమీ వాడలేదు. పురుగు మందులు ఏమీ కొట్టలేదు. మామూలుగానే నీటి తడులు అందించిన. దిగుబడి పరవాలేదు. ఇది ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే రకం. రైతులు అమ్మడం కోసం కాకున్నా తమకోసమైనా పండించుకోవాలి.

Leave Your Comments

శరీరంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం..

Previous article

వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Next article

You may also like