BJP MP Varun Gandhi writes letter to PM Modi దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాల రద్దు అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ నిన్న నవంబర్ 19న మూడు వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రకటనతో దేశవ్యాప్తంగా మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు వామపక్షాలు సైతం మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తనదైన శైలిలో స్పందిస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు.

BJP MP Varun Gandhi
గత కొద్ది రోజులుగా పార్టీ విధానాలపై బాహటంగానే విమర్శలు గుప్పిస్తోన్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. తాజాగా మూడు సాగు చట్టాల రద్దు చేస్తున్నట్టు ప్రధాని చేసిన ప్రకటనపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన వరుణ్.. నాలుగు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. పంటలపై కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని అయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆందోళన చేపడుతున్న రైతులంతా తమ ఇండ్లకు వెళ్లాలంటే తక్షణమే ప్రభుత్వం చట్టాన్ని చేయాలని ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.

BJP MP Varun Gandhi and modi
రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు చేస్తూ సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారంగా కోటి ఇవ్వాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. గత నెలలో లఖింపూర్ ఖేర్ హింసాత్మక ఘటనపై కూడా వరుణ్ గాంధీ ప్రధానికి రాసిన తాజా లేఖలోనూ ప్రస్తావించారు. కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ( BJP MP Varun Gandhi writes letter to PM Modi )