PM Fasal Bima Yojana: ప్రతి సంవత్సరం భారతదేశం తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ పంట నష్టాలను చవిచూస్తుంది. ఈ నష్టాలను భరించేందుకు రైతులకు సహాయం చేయడానికి అనేక బీమా పథకాలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి. ఈ పథకాల కింద నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది. తద్వారా రైతులు ఆర్ధికంగా ఎదుగుతారు.

Crop Insurence
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) వ్యవసాయ రంగంలో ఊహించని సంఘటనల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వివిధ పంటలపై వివిధ బీమా పాలసీలు ఇస్తారు. ఆహార పంటలు (తృణధాన్యాలు, మినుములు మరియు పప్పుధాన్యాలు), నూనెగింజలు, వార్షిక వాణిజ్య లేదా వార్షిక ఉద్యాన పంటలు మొదలైన వాటికి ప్రత్యేక విధానాలు ఉన్నాయి.
Also Read: ప్రధానమంత్రి ఫసల్ బీమా ఎలా పొందాలి ?

PM Fasal Bima Yojana
ఏ కంపెనీలు పంటల బీమాను అందిస్తాయి?
పీఎం ఫసల్ బీమా యోజన అధికారిక వెబ్‌సైట్ క్రింద పంట బీమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే సమయంలో ఇక్కడ పేర్కొన్న బీమా కంపెనీల నుండి పంట బీమా పథకాన్ని పొందవచ్చు.
- రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- బజాజ్ అలయన్జ్
- ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- ఇఫ్కో (IFFCO) టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ
- ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
- SBI జనరల్ ఇన్సూరెన్స్
- యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ
Also Read: వ్యవసాయరంగానికి ప్రోత్సాహమేది: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి