వార్తలు

మామిడి ఆకుల వలన కలిగే ప్రయోజనాలు

0

మామిడిఆకుల్లో పోషకాలు అధికమట. మామిడి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పుష్కలంగా వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మందికి డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఇప్పుడు మనిషి జీవన శైలిలో ఒక భాగమైంది. దీని చికిత్స లో ఔషధాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యమైనవి. మామిడి ఆకులలో విటమిన్ సి, పెక్టిన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్దాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మామిడి ఆకులు మధుమేహా లక్షణాలైన అధిక బరువు, రాత్రి తరచుగా మూత్ర విసర్జన చేయడం, దృష్టి మసక బారడం వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తాయని కొన్ని ఇతర స్టడీలు కూడా చెబుతున్నాయి. డాక్టర్ సలహా మేరకు మామిడి ఆకుల మిశ్రమాన్ని తీసుకుంటూ డయాబెటిస్ తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మామిడాకులను నీళ్ళలో మరిగించడం లేదా పౌడర్ చేసి ఉపయోగించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మామిడి ఆకులను ఎలా తీసుకోవాలి:

తాజా మామిడి ఆకులు 15 తీసుకొని వాటిని 150మి.లీ.నీటిలో వేయండి. ఇలా రాత్రంతా ఉంచండి.

ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ముందు ఆ నీటిని దీన్ని తాగండి. ఇలా ప్రతి రోజూ పరగడుపున ఈ నీళ్ళను మూడు నెలల పాటు తాగండి.

మామిడి ఆకుల నీళ్ళను తాగడం వల్ల ఆస్తమాను తగ్గించుకోవచ్చు.

రోజుకు కప్పు మామిడాకుల టీ తాగడం మర్చిపోకండి. అన్ని రకాల శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో మామిడాకుల టీ గొప్పగా సహాయపడుతుంది.

డయాబెటిస్ను ఎలా తగ్గిస్తాయి:

ఇన్సులిన్ శాతాన్ని మెరుగుపరిచి గ్లూకోజ్ డిస్ట్రిబ్యూషన్ ను పెంచుతాయి. ఫలితంగా రక్తంలో చక్కెర లెవెల్స్ స్దిరంగా ఉంటాయి.

శరీరంలో హానికరమైన కొవ్వుశాతాన్ని తగ్గించి డయాబెటిస్ లక్షణాలకు దూరంగా ఉంచుతాయి.

ఆస్తమా లాంటి ఇతర సమస్యలను దూరం చేస్తుంది.

మామిడాకుల్లో ఔషధ గుణాలతో పాటు వైద్య లక్షణాలు చాలా వున్నాయి. వీటిని మూలికలతో పాటు ఈస్టర్న్ మందుల్లో కూడా వాడతారు.

Leave Your Comments

జీరో టిల్లెజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు

Previous article

మిరపకోత అనంతరం పంట నిల్వలో రైతులు చేపట్టవలసిన జాగ్రత్తలు

Next article

You may also like