Benefits Of Farmers Godown Subsidy దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ధాన్యాన్ని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అతి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో కనీసం గిట్టుబాటు ధర లభించక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బృహత్తర పథకమే గోడౌన్ సబ్సిడీ పథకం.
ఆరుగాలంపండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం పక్కనపెడితే దళారులు తక్కువ ధరకే పంటను కొంటున్న వైనం. లేదూ… …గిట్టుబాటు ధర కోసం కొంతకాలం ఆగుదామనుకుంటే అకాల వర్షాలు వచ్చి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. నిలువ చేసుకునే సామర్ధ్యం లేకపోవడంతో రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రైతు కష్టాలను గమనించి గోడౌన్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం నిజంగానే రైతుల పాలిట వరంగా మారింది. ఈ పథకం కింద ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి స్టోర్ హౌస్ నిర్మించుకోవచ్చు.
How To Apply Godown Subsidy Scheme గోడౌన్ సబ్సిడీ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే..స్టోర్ హౌస్ ల నిర్మాణం. ధాన్యాన్ని నిలువ ఉంచుకునేందుకు స్టోర్ హౌస్ లను నిర్మించుకునేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుంది. ఆ డబ్బుతో స్టోర్ హౌస్ లను నిర్మించుకుని, అందులో పంట ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల పంటని ఎవ్వరికీ తక్కువ ధరకి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో భాగంగా రైతులకు రుణాల కిందా 25 శాతం వరకు రాయితీలు అందిస్తుంది. రైతులు ఈ సబ్సిడీ రుణాలను ఉపయోగించుకొని స్టోర్ హౌస్‌లను నిర్మించుకోవాలి. తద్వారా అధిక వర్షాలు, ఎండల నుంచి పండించిన పంటకు సేఫ్టీ దొరుకుతుంది. ఎంత కాలమైన ధాన్యం చెడిపోకుండా కాపాడుకోవచ్చు.
అయితే రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే గోడౌన్ సబ్సిడీ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. అందులో హోమ్‌పేజీని ఓపెన్ చేయాలి. Apply Now పై క్లిక్ చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించాలి. ఇది కాకుండా కొన్ని ముఖ్యమైన పత్రాలను జతచేయాలి. అధిక సమాచారం కోసం సంబంధిక అధికారుల్ని సంప్రదించాలి. Benefits Of Farmers Godown Subsidy Scheme