వార్తలు

బ్యాంకులు పంటలకిచ్చే రుణ పరిమితి ఖరారు..

0

ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో పంటలకిచ్చే రుణ పరిమితిని బ్యాంకులు ఖరారు చేసింది. కొత్తగా ఈ ఏడాది ఆయిల్ పామ్ పంటకు రుణం ఇచ్చే అందుకు ఆమోద ముద్ర వేశారు. ఆహార, వాణిజ్య పంటల వారీగా ఎంత మొత్తంలో ఇవ్వాలన్నది నిర్ణయించారు. పెట్టుబడులు ఏటా పెరుగుతున్నా రైతులకు ఇచ్చే రుణాల పరిమితి మాత్రం అంతే ఉంది. సమీకృత వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు నాబార్డు సూచలతో ఈ ఏడాది నుంచి ఉద్యాన పంటలతోపాటు పాడి, పశువుల పెంపకం చేపట్టే రైతులకు విరివిగా రుణాలివ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కోళ్లు, పందులు, మేకలు, గొర్రెల పెంపకం కోసం ప్రత్యేకంగా రుణ పరిమితి నిర్దేశించారు. మామిడి, బొప్పాయి, కొబ్బరి, బత్తాయి, సపోట, సీతాఫలం, కర్భూజ, పుచ్చకాయ, దానిమ్మ, జామ, నిమ్మ, అరటి, గులాబీ, మల్లెతోటలకు రుణ సౌకర్యం కల్పించారు. పౌల్ట్రీకి సంబంధించి బాయిలర్ కోళ్లకు రూ. 145 – 150 చొప్పున, లేయర్స్కు రూ.300 – 310 చొప్పున గేదెలు, ఆవులకు రూ. 21 – 23 వేల వరకు ఇవ్వనున్నారు.
గతేడాదితో పోల్చితే రుణ లక్ష్యంగా సుమారు రూ. 1,215 కోట్లు పెంచారు. వ్యవసాయ రంగాలకు భారీ లక్ష్యాలు నిర్దేశించారు. పంట రుణపరిమితి మాత్రం పెంచకపోవడంతో రుణ లక్ష్యం చేరేది అనుమానంగానే ఉంది. రుణ మాఫీ అమలుపై సందిగ్ధం నెలకొనడంతో రైతులు తమ రుణాలను నవీకరణ చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. పంటల వారీగా ఇచ్చే రుణ పరిమితిని కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు ఒకే తీరుగా నిర్ణయించారు. ఈ మేరకు నిజామాబాద్ సహకార బ్యాంకులో ఫిబ్రవరి మాసంలో ఉభయ జిల్లాల లీడ్ బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకు మేనేజర్లు సమావేశమై రుణ పరిమితిని ప్రతిపాదించారు. దీనిని 15 రోజుల కిందట జరిగిన సమావేశంలో నాబార్డు ఆమోదిస్తూ బ్యాంకులకు ప్రస్తుత వానాకాలంలో నూతన రుణ పరిమితి ఆధారంగానే రుణాలు మంజూరు చేయాలని గతేడాది నాబార్డు నిర్దేశించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
పంట పెట్టుబడికి బ్యాంకుల రుణ పరిమితికి పొంతన లేకుండా ఉంది. సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, కూలీలు తదితర ఖర్చులు పెరిగిపోతున్నా రుణం మాత్రం పెరగడం లేదు. రైతులు విధి లేని పరిస్థితిలో వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆరుగాలం కష్టపడ్డా అప్పులే మిగులుతున్నాయి. పత్తి సాగుకు ఎకరానికి రూ.వేలకు పైగా ఖర్చవుతోంది. కానీ ఎకరానికి రూ. 38 వేలు మాత్రమే రుణ పరిమితి ప్రతిపాదించారు.

Leave Your Comments

మిద్దెతోట సాగులో అక్క చెల్లెళ్ళు ..

Previous article

గసగసాలు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

Next article

You may also like