వార్తలు

OPSC Recruitment 2022: 123 అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ పోస్టులకు ఆహ్వానం

0
OPSC Recruitment 2022

OPSC Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (OPSC) 123 అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ (AAO) రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ఈ రోజు (జనవరి 28) నుండి opsc.gov.in లో పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

OPSC Recruitment 2022

OPSC Recruitment 2022

పబ్లిక్ సర్వీస్ కమీషన్ రిక్రూట్‌మెంట్ 2022 యొక్క పూర్తి వివరాలు:

* 123 అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం నేటి నుండి అంటే జనవరి 28, 2022.
* దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28, 2022.
* ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 7, 2022

అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అర్హత & ఇతర వివరాలు:

పోస్టుల సంఖ్య – 123 (42 పోస్టులు మహిళలకు; 4 మాజీ సైనికులకు & 5 పోస్టులు వికలాంగులకు).
వయోపరిమితి – అభ్యర్థులు జనవరి 1, 2021 నాటికి 21 నుండి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్‌కు విద్యార్హత:

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయం లేదా హార్టికల్చర్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టా పొంది ఉండాలి.

దరఖాస్తు రుసుము:
అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది, రిజర్వ్‌డ్ కేటగిరీ (SC/ST/OBC) అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read: 123 అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు

అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ:

  • AAO పోస్టులకు అభ్యర్థులను వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు , దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. పరీక్ష కటక్‌లో జరగనుంది.
OPSC

OPSC

అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?:

  • OPSC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.
  • హోమ్‌పేజీలో తాజా వార్తల విభాగం కింద, మీరు AAO పోస్ట్ కోసం రిజిస్ట్రేషన్ లింక్‌ కనిపిస్తుంది.
  • లింక్‌పై క్లిక్ చేసి, అన్ని వివరాలను సరిగ్గా నమోదు చెయ్యాలి.
  • వివరాలను నమోదు చేసిన తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మరియు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • చివరగా ఫారమ్‌ను సమర్పించండి.
  • మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చదవగలరు.సాంకేతిక సహాయం కోసం – 0671 – 2304707కు కాల్ చేయండి.

Also Read: TS గిడ్డంగుల సంస్థలో టెక్నికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ….

Leave Your Comments

Wildlife Animals: అంతరించిపోతున్న వన్యప్రాణులు

Previous article

Yarsagumba: యర్సాగుంబ కిలో రూ. 60 లక్షలు

Next article

You may also like