ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) సోమవారం మరో అంతర్జాతీయ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్ లైన్ వేదికగా ఈ కార్యక్రమం ఆఫ్రికన్ – ఆసియన్ రూరల్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (AARDO) తో ఈ ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ఎఎఆర్ డిఒ సెక్రటరీ జనరల్ మనోజ్ నార్ డియోసింగ్,(Manoj Nar Diyosingh) సలహాదారు ఆర్ పి సింగ్ ,పిజెటిఎస్ఏయు ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు (Dr.V.Praveen Rao),రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ (S.Sudheer Kumar) ఇతరులు పాల్గొన్నారు. తమ సంస్థ ఇప్పటి వరకు 40 ఎం ఒ యులు కుదుర్చుకున్నదని మనోజ్ తెలిపారు. 12 దేశాల్లో 30 సెంటర్స్ అఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేశామన్నారు. పి జె టి ఎస్ ఏ యు తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి అంశాల్లో కలిపి పనిచేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఉత్పత్తి , ఉత్పాదకల్లో మంచి పురోగతి సాధిస్తునదన్నారు. వర్సిటీ విద్య , పరిశోధనల్లో కొత్త పుంతల తోక్కుతున్నదని మనోజ్ అభినందించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు పరస్పరం కలిసి పనిచేస్తూ అనుభవాల్ని, టెక్నాలజీని మార్చుకుంటూ ఆహార, పౌష్టికాహార భద్రతకు, సమీకృత గ్రామీణభివ్రుద్దికి కృషి చేయాలని మనోజ్ అభిప్రాయ పడ్డారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైన ఏడేళ్ళలోనే పి జె టి ఎస్ ఏ యు జాతీయ స్థాయిలో టాప్ 5–6 స్థానాల్లో నిల్చిందని ప్రవీణ్ రావు తెలిపారు. గత కొన్నాళ్లుగా అనేక జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ముందుకెళుతున్నామని అన్నారు. ప్రపంచంలో రైతులకి ఉపయోగపడే పరిజ్ఞానం ఎక్కడవున్నా అందిపుచ్చుకోవాలన్న సిఎం కెసిఆర్ ఆదేశాలతో పనిచేస్తున్నమన్నారు. ఇప్పటి వరకు వర్సిటీ 6-7 ప్రధాన పంటల్లో 45 వెరైటీ లను విడుదల చేసిందని. అందులో 13 వెరైటీలు దేశం లోనే ఇతర రాష్ట్రాల్లోనూ ఆదరణ పొందాయని ప్రవీణ్ రావు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2,500 రైతు వేదికల్లోనూ డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి జరుగుతుందని అది పూర్తి అయితే వర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరితో నేరుగా సంభంధాలు ఏర్పరచుకుంటుదన్నారు. రిజర్వు బ్యాంకు ఈ మధ్య విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ ఆదాయం ఈ ఏడేళ్ళ లోనే రెట్ట్టింపు అయిందని దీనిలో వ్యవసాయరంగం వాటా 22 శాతంగా ఉందని ప్రవీణ్ రావు అన్నారు.
రైతుల సృజనాత్మకతని వెలికి తీసి ,మెరుగు పర్చడానికి వర్సిటీ కృషి చేసున్నదని ప్రవీణ్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.