వార్తలు

ఏపీలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు ప్రారంభం..

0
AP Food Industries

AP Food Industries

AP Govt Set Establishment Food Industries ఆహార పరిశ్రమల ఏర్పాటుకు సీఎం వైస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. రైతుల ఆదాయం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహార పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. ఆహార పరిశ్రమల ఏర్పాటు వల్ల రైతుల ఆదాయం పెంచడమే గాకా, యువతకు ఉపాధి అవకాశం కూడా కల్పించబడుతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో తొలివిడతలో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందుగా వైఎస్సార్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న నాలుగు యూనిట్లకు బుధవారం టెండర్లు పిలవగా.. మిగిలిన వాటికి సంక్రాంతిలోగా టెండర్లను ఆహ్వానించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. మార్చిలోగా పనులు ప్రారంభించి డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని, 2023 జనవరి నుంచి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కన్నబాబు ఈ సందర్భంగా తెలిపారు. AP Food Processing Units

AP Food Industries

Minister Kannababu ఏపీ పార్లమెంటు నియోజకవర్గస్థాయిలో రూ.2,389 కోట్లతో 26 సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. అయితే వీటి నిర్వహణకు గాను దాదాపుగా 115 కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ ప్రక్రియకు భూసేకరణ కూడా పూర్తయింది. వీటి కోసం ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పద్ధతిలో కనీసం 15 ఏళ్ల పాటు లీజ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ మోడల్‌లో టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. తొలివిడతగా రూ.233.48 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. Food Processing Policy

AP Food Industries

AP Food Industries తొలి విడతలో భాగంగా.. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో రూ.33.79 కోట్లతో 5 ఎకరాల్లో రోజుకు 114 టన్నుల సామర్థ్యంతో డ్రైడ్‌ హనీడిప్డ్‌ బనానా యూనిట్, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో రూ.24.90 కోట్లతో 7.02 ఎకరాల్లో రోజుకు రెండు టన్నుల సామర్థ్యంతో మామిడి తాండ్ర యూనిట్, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జన్నంపేట వద్ద 9.5 ఎకరాల్లో రోజుకు 127 టన్నుల సామర్థ్యంతో రూ.82.07 కోట్లతో కోకో ప్రాసెసింగ్‌ యూనిట్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాలలో రూ.92.72 కోట్లతో 15 ఎకరాల్లో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో డీ హైడ్రేషన్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్‌ యూనిట్లకు టెండర్లను ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటిద్వారా ప్రత్యక్షంగా 500 నుంచి 600 మందికి, పరోక్షంగా 1,500 మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు మంత్రి కన్నబాబు. AP Food Industries

Leave Your Comments

నీరు అవసరం లేని ఏకైక పంట

Previous article

వరి సేకరణలో తెలంగాణపై కేంద్రం ప్రశంస

Next article

You may also like