Three Farmers Suicide In Telangana కళ్ళముందు కళకళలాడుతున్న పంట కోయలేక.. కోసినా అమ్మలేక.. కళ్లముందే పంట కుళ్లిపోతుంటే చూడలేక అన్నదాతల గుండెలు అలసిపోతున్నాయి. అప్పులపై చక్రవడ్డీలు పెరుగుతూ వారి మెడకు ఉరి తాడులా మారుతున్నాయి. మన దేశంలో జాతీయ నేరాల నమోదు సంస్థ డేటా ప్రకారం రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది.నిజానికి తెలంగాణ వ్యవసాయానికి అన్ని వసతులు పుష్కలంగా ఉన్నాయి. 24 గంటల పాటు కరెంటు, కావాల్సినంత భూగర్భ జలాలు, ఇక ప్రభుత్వం రైతు బంధు, ఎరువుల పంపిణి, కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం ఇలా ప్రభుత్వం తరుపున అనేక సహాయ సహకారాలు రైతులకు అందిస్తుంది. కానీ అవేం రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. తెలంగాణాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మధ్య కాలంలో పంట కొనుగోలు విషయంలో పదుల సంఖ్యలో రైతన్నలు ప్రాణాలు విడిచిన పరిస్థితి.

Farmers Suicide In Telangana
రాష్ట్రంలో నిరుడు 760 మంది అన్నదాతల ఆత్మహత్యలు చోటుచేసుకోగా..ఈ ఏడాది 9 నెలల్లోనే 802 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో ఎక్కువగా పత్తి రైతులే ఉన్నారు. ఇక మృతుల్లో 80% కౌలు రైతులే ఉన్నట్లు సమాచారం. తాజాగా తెలంగాణాలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. Farmers Suicide In Telangana

పెద్దపల్లి, హన్మకొండ, జయశంకర్ భూపాల పల్లి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. ముత్తారం, మొగుళ్లపల్లి, పరకాలలో ఈ మరణాలు చోటుచేసుకున్నాయి. పంట దిగుబడి సరిగా రాక, వర్షాలకు పంట కొట్టుకుపోయి ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Telangana Farmers Suicides