వార్తలు

రైతుల ప్రయోజనాల కోసం కీలక ఒప్పందం

0
Andhra govt With FAO ICAR

Andhra govt ties up with ICAR and FAO

  • వ్యవసాయరంగంలో ఆర్బీకేలు దేశానికే రోల్‌మోడల్‌
  • రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సాంకేతికత మరియు ఆర్ధిక చేయూత
  • సీఎం వైస్ జగన్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న ఎఫ్‌ఎఒ, ఐసిఏఆర్

సీఎం వైస్ జగన్ YS Jagan సర్కారు ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలకు సాంకేతిక పరంగానూ, ఆర్ధిక పరంగానూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు యునైటెడ్‌ నేషన్స్‌కు చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎఒ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌(ఐసిఏఆర్) ప్రతినిధులు. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైస్ జగన్ తో భేటీ అయ్యారు సదరు కంపెనీ ప్రతినిధులు. భేటీలో భాగంగా ఎఫ్‌ఎఒ, ఐకార్‌ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. సీఎం వైస్ జగన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన ఒప్పంద పత్రాలపై వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి పూనం మాలకొండయ్య, ఎఫ్‌ఎఒ ఇండియా డైరక్టర్‌ టోమియో షిచిరి, ఐకార్‌ డిప్యూటి డైరక్టర్‌ జనరల్‌ ఏకె సింగ్‌ పరస్పరం సంతకాలు చేసి మార్చుకున్నారు. FAO And ICAR

CM YS JAGAN

సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఏ విధంగా మేలు చేకూరుస్తున్నాయో సీఎం జగన్ ప్రతినిధులకు వివరించారు. అలాగే వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన వినూత్న పథకాలు, మార్పులను భేటీలో ప్రస్తావించారు. కాగా.. గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు నివినియోగించడం ద్వారా రైతన్నలు తీవ్రంగా నష్టపోయినట్లు సీఎం గుర్తు చేశారు. అందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి రైతుల్ని ఆదుకుంటున్నట్టు సీఎం చెప్పారు. Andhra govt ties up with ICAR and FAO

icar fao

ఇక రైతులకు మద్దతు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇ– క్రాపింగ్‌ గురించి ప్రతినిధులకు సీఎం చెప్పారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయరంగంలో పెను మార్పులు వస్తున్నాయని సీఎం వైస్ జగన్ తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్‌ ఎండీ జి శేఖర్‌బాబు పాల్గొన్నారు. AP Agriculture Latest News

Leave Your Comments

ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ సూచనలు..

Previous article

ఇకపై రైతులకు ఐడీ కార్డులు…

Next article

You may also like