వార్తలు

మూడు సాగు చట్టాలను రద్దు చేసే తేదీలు…

0
Agriculture Ministry to finalize dates to discuss three farm Laws

Agriculture Ministry వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ సాగు చట్టాలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాల్లో లోటుపాట్లు ఉన్నాయంటూ రైతులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సాగు చట్టాలపై నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రైతులు ఏడాది కాలంగా ఉద్యమం చేశారు. 40 రైతు సంఘాలతో ప్రారంభమైన వారి ఉద్యమం ప్రపంచస్థాయిలో ఆదరణ పొందింది. దీంతో విదేశాల ప్రతినిధులు సైతం మూడు సాగు చట్టాలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీ మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా చారిత్రాత్మక ప్రకటన చేశారు. అయితే కేవలం ప్రకటన మాత్రమే కాదు, సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా బిల్ అమలులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుని రద్దు చేసిన తర్వాతే ఉద్యమం విరమిస్తామని రైతులు డిమాండ్ చేశారు.

modi on three farm laws

అయితే.. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ఎప్పుడు రద్దు చేస్తారనే ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తేదీలపై చర్చిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం తెలిపారు. నవంబర్ 24న ఆమోదం కోసం మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణను కేంద్ర మంత్రివర్గం చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాల ఉపసంహరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. Agriculture Ministry to finalize dates to discuss three farm Laws

protest on three farm laws

మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న ప్రకటించారు. కనీస మద్దతు ధర (MSP) కోసం కొత్త ఫ్రేమ్‌వర్క్‌పై పని చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని ప్రధాన మంత్రి ప్రకటించారు. 2020లో కేంద్రం చట్టాలను ఆమోదించినప్పటి నుండి రైతులు ప్రభుత్వం యొక్క మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. Minister Pralhad Joshi

Leave Your Comments

నూనె ధరలు మరింత తగ్గనున్నాయా ?

Previous article

ఏపీలో రూ.3,000 కోట్ల మేర పంట నష్టం…

Next article

You may also like