“మన కూరగాయలు పథకం”, రైతుబజార్ల నిర్వహణ పై బోయిన్ పల్లి మార్కెట్ లో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి
కూరగాయల సాగుకు రైతుకు మరింత ప్రోత్సాహం
- విత్తన సబ్సీడి,యాంత్రీకరణ,ఇతర ప్రోత్సాహకాలపై ప్రభుత్వ దృష్టి
- హైదరాబాద్ నగర అవసరాలకు అనుగుణంగా సమీప జిల్లాల రైతులను ప్రణాళికాబద్దంగా ప్రోత్సహించాలి
- నగరవాసుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ డిమాండ్ ను బట్టి నెలవారీ ఎంత సాగు చేయాలనేది ముందే అంచనావేసి దానిని బట్టి రైతులకు అవగాహన కల్పించాలి
- దళారి వ్యవస్డను తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర,వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం మన కూరగాయలు పథకం ప్రధాన ఉద్దేశం
- రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు,ఇతర పనిముట్లు లభించే విధంగా రైతు బజార్ లో అందుబాటులో ఉంచే అవకాశాలను అధికారులు పరిశీలించాలి
- కూరగాయలు,పండ్లు ఉత్పత్తి చేసే ఎఫ్ పి ఓ లు,రైతులు నేరు గా వినియోగదారులకు అమ్ముకునేందుకు వసతులు కల్పించే చర్యలు చేపట్టాలి
- నగర సమీపంలో కూరగాయలు పండించే రైతులను రైతు బజార్లకు అనుసంధానం మరింత పెరగాలి
- కూరగాయలు తెచ్చే ఆర్టీసీ బస్సులను పునరుద్దరణకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి
- మార్కెటింగ్,ఉద్యాన శాఖలు సమన్వయము తో పనిచేయాలి
- రాబోయే వేసవి అవసరాలకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక చేసి రైతువేదికల ద్వారా వ్యవసాయ,ఉద్యాన అధికారులు రైతులకు నిరంతర శిక్షణ ఇవ్వాలి
- అన్నం పెట్టే రైతన్నను ప్రోత్సహించేందుకు అందరూ మనసుపెట్టి పని చేయాలి
- ప్రతిభ చూపిన అధికారులను ప్రభుత్వం తరుపున ప్రోత్సాహకాలతో సత్కరిస్తాం
- “మన కూరగాయలు పథకం”, రైతుబజార్ల నిర్వహణ పై బోయిన్ పల్లి మార్కెట్ లో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి,మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ రవికుమార్,వివిధ జిల్లాల అధికారులు
- వివిధ జిల్లాలలో కూరగాయల సాగు తీరును వివరించిన అధికారులు
Leave Your Comments