ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు
చిరుధాన్యాలు, పప్పుదినుసులే ఆరోగ్యానికి శ్రేయస్కరం
- ప్రాచీన ఆహార అలవాట్లే మన ఆరోగ్యానికి అనుకూలం
- ప్రజల శ్రమకు తగిన ఆహారం భుజించడమే ఆరోగ్యానికి అనుకూలం
- రైతాంగం పప్పు దినుసులు, చిరుధాన్యాలు పండించాలి, రసాయనిక ఎరువులు వాడకం తగ్గించాలి
- కరోనా వైరస్ మూలంగా గ్రామీణ జీవనం, ఆహారపు అలవాట్లు గుర్తుకు వచ్చాయి
- పిల్లల భవిష్యత్ కోసమైన మన మూలాలను విస్మరించకుండా ముందుకు సాగాలి
- గ్రామాలు విధ్వంసమైతే ప్రపంచంలో ఏమీ మిగలదు
- ప్రజలకు అవసరం లేని వ్యవసాయ ఉత్పత్తులను మనం సాగు చేయడం మానుకోవాలి
- ప్రపంచ మార్కెటింగ్ డిమాండ్, అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి
- వరి వంటి ఉత్పత్తులు తగ్గించాలి. కంది సాగును ఈ ఏడాదిని తెలంగాణలో ప్రోత్సహించాం.. 10.80 లక్షల ఎకరాలలో దానిని తెలంగాణలో సాగు చేశారు
- మద్దతు ధర క్వింటాలుకు రూ. 6000 కానీ మద్దతు ధరను మించి ఏడు వేల పైచిలుకు ధర మార్కెట్ లో పలుకుతుంది
- పప్పుధాన్యాలను ఆహారంగా స్వీకంరించడం పదివేల ఏళ్ల క్రితం నుండి ప్రారంభమయింది
- మాంసాహారం స్వీకరించడం తదనంతర కాలక్రమంలో ప్రారంభమయింది
- పప్పు దినుసుల స్వీకరణ లోపం మూలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి
- ఆరోగ్య సూచనలను అనుసరించి వాటిని స్వీకరించాలి
- పౌరుల జీవన విధానానికి అనుగుణంగా పుప్పుధాన్యాల సాగుకు సహకారం అందించాలి
- యూఎన్ఓ సూచనలకు అనుగుణంగా మనం ముందుకు సాగాలి
- ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.. ఈ దిశగా ప్రోత్సాహం అందిస్తున్నారు
- ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు
Leave Your Comments