వార్తలు

దేశవ్యాప్తంగా ఎంత పంట నష్టం జరిగింది?

0
Agri Crop

crop damages

Agri crops in 50.40 lakh hectare hit దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు లక్షల హెక్టార్లో పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట వరదపాలు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడి పెట్టిన పంట నీటిపాలవడంతో చేసేదేం లేక సాయం కోసం ప్రభుత్వాల వంక చూస్తున్నారు రైతన్నలు. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల్లో ఆ అంశం చర్చకు వచ్చింది. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ . భారీ వర్షాల కారణంగా కురిసిన వర్షాలకు పంట నష్టంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంటులో చర్చించారు. ఈ ఏడాది ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో దేశవ్యాప్తంగా దాదాపు 50.40 లక్షల హెక్టార్లలో Agri crops in 50.40 lakh hectare hit సాగుచేసిన వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని మంత్రి అన్నారు. కర్ణాటకలో అత్యధిక నష్టం నమోదైందని అయన తెలిపారు. అయితే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుండి నవంబర్ 25 నాటికి రూ. 8,873.60 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.

Narendra Singh Tomar

Narendra Singh Tomar

Narendra Singh Thomar తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల కోసం SDRF కంటే ఎక్కువ అదనపు సహాయాన్ని జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) అందిస్తుందని అన్నారు. మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్వీకరించిన మెమోరాండం ఆధారంగా పంట నష్టానికి నష్టపరిహారం అందించనుంది. నవంబర్ 25 నాటికి కర్ణాటక గరిష్టంగా 13.98 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నివేదించింది, పశ్చిమ బెంగాల్ (6.90 లక్షల హెక్టార్లు), రాజస్థాన్ (6.79 లక్షల హెక్టార్లు), బీహార్ (5.80 లక్షల హెక్టార్లు) ), మహారాష్ట్ర (4.55 లక్షల హెక్టార్లు) మరియు ఉత్తరప్రదేశ్ (3.61 లక్షల హెక్టార్లు) మేర పంట నష్టం జరిగింది. కాగా.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) భారీ వర్షాల కారణంగా రైతులకి అవగహన శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని అన్నారు మంత్రి. Crop Damages In India 

Leave Your Comments

ధాన్యం కొనుగోలులో చీకటి ఒప్పందాలు ?

Previous article

వ్యవసాయ శాస్త్రవేత్తలతో నాబార్డ్ ఛైర్మన్

Next article

You may also like