వార్తలు

జయశంకర్ యూనివర్సిటీతో సహస్ర ఒప్పందం….

0
Agreement Between PJTSAU and AIOI
Agreement Between PJTSAU and AIOI

PJTSAU : అగ్రిబయోటెక్నాలజీ, నానోటెక్నాలజీలో పరస్పర సహకారం కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదుకు చెందిన సహస్ర క్రాప్ సైన్సెస్ గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అవగాహన ఒప్పంద పత్రాలను ఉపకులపతి డా:వి.ప్రవీణ్ రావు సమక్షంలో రిజిస్ట్రార్ డా:ఎస్.సుధీర్ కుమార్, సహస్ర క్రాప్ సైన్సెస్ ఎం.డి.చంద్రమోహన్ ఒకరికొకరు మార్చుకున్నారు. ( Agreement Between PJTSAU and AIOI )

Agreement Between PJTSAU and AIOI

ఒప్పందం వల్ల విద్యార్థులు, ఫ్యాకల్టీ పరస్పర విజ్ఞాన మార్పిడికి దోహదం చేయాలని ఉపకులపతి సూచించారు. అలాగే ఇరు సంస్థలు కలిసి సంయుక్త పరిశోధన పథకాలను రూపకల్పన చేయాలని, దీనిద్వారా ఇరు సంస్థలకు ఉపయోగకారకమన్నారు. ఎంపిక చేసిన అంశాలపై ప్రతి ఏడాది ఒకటి, రెండు మేధోమధన సదస్సులు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని ఉపకులపతి డా:ప్రవీణ్ రావు సహస్ర ప్రతినిధులకు సూచించారు. విశ్వవిద్యాలయం దత్తత గ్రామాలలో సహస్ర క్రాప్ సైన్సెస్ ఉత్తత్తులను అధ్యాయనం చేయాలని సూచించారు. వ్యవసాయ డిగ్రీ విద్యార్థులకు ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమాలకు పంపాలని డీన్ అగ్రికల్చరకు ఉపకులపతి సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, సహస్ర సంస్థల ప్రతినిధులు, సహస్ర టెక్నికల్ డైరెక్టర్ శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు PJTSAU Website ను చూడగలరు.

 

Also Read : వ్యవసాయ చట్టాల రద్దుపై తెలంగాణ మంత్రుల కామెంట్స్…

Leave Your Comments

ధాన్యం సేక‌ర‌ణ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు మంత్రుల విన‌తిప‌త్రం

Previous article

వరి కొనుగోలుపై కేంద్రం వైఖరి ఇదేనా…!

Next article

You may also like