73rd Republic Day Celebrations: 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. కోవిడ్ ఆదేశాలు పాటిస్తూ దేశ ప్రజలు 73 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. సాధారణంగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలను దేశం జరుపుకుంటుంది. అయితే ఈ సారి మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23వ తేదీ నుంచి దేశంలో గణతంత్ర వేడుకల శోభ కనిపించింది.
Also Read: తెలంగాణ వ్యవసాయ భూములకు రెక్కలు

73rd Republic Day Celebrations
కాగా.. 73 వ భారత గణతంత్ర దినోత్సవం ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం పరిపాలన భవనంలో జరిగింది. ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు జాతీయ జెండాని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ,డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ లకు నివాళులు అర్పించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్ కుమార్ ఇతర అధికారులు, బోధన, భోదనేతర, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమం నిర్వహించారు.
Also Read: హరిత వ్యవసాయం దిశగా శ్రీలంక