12 Laksh Of Bank Detailes Missing For Rythubandhu తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు పథకం ప్రారంభమైంది. నిన్న మంగళవారం తొలిరోజు 18.12 లక్షల మంది రైతు ఖాతాలోకి రూ.544 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఎకరాలోపు భూమి కలిగిన 18,12,566 మంది రైతు ఖాతాల్లో తొలిరోజు రూ.544.55 కోట్లు జమ చేసింది ఆ శాఖ. కాగా నేడు బుధవారం రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న వారి ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున సొమ్మును జమ చేస్తారు. 544 cr released for Rythu Bandhu
ఇకపోతే ఈ సీజన్ రైతుబంధు పథకానికి 12 లక్షల మంది రైతులు తమ వివరాలను ఇవ్వలేదని వ్యవసాయ శాఖ చెప్తుంది. పట్టాదారు పాసుపుస్తకాలున్న వీరి బ్యాంకు ఖాతాల వివరాలను ఏఈవో అధికారులు అడిగినా ఇవ్వలేదని చెప్తున్నారు. ఒకవేళ వారి వివరాలను తమకు ఇస్తే ఈ నెల 31వ తేదీలోగా రైతుబంధు పోర్టల్ లో నమోదు చేసే అవకాశం ఉంది. ఇక కొందరి ఖాతా వివరాలు కూడా పని చేయని పరిస్థితి నెలకొంది. రైతుబంధు పథకం కిందా సొమ్ము జమ చేసినప్పుడు దాదాపుగా 5500 మంది రైతు ఖాతాల నుంచి సొమ్ము వెనక్కి వచ్చిందట. కాగా.. సదరు ఖాతాలకు పరిశీలించాలని ఏఈవోలను సంబంధిత వ్యవసాయ శాఖ కోరింది. ఇలా వివిధ కారణాలతో మొత్తం 1.78 లక్షల మంది రైతుల ఖాతాలను ఏఈవోలు పరిశీలిస్తున్నారు. ఆ వివరాలన్నీ తనిఖీ చేశాక రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేస్తారు. Rythubandhu
కాగా.. రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి 7 విడతల్లో రైతుల ఖాతాల్లో మొత్తం రూ.43,036.63 కోట్లు జమ కాగా.. ఈ సీజన్‌తో కలిపితే మొత్తం రూ.50 వేల కోట్ల మైలురాయిని చేరుకుంటుంది.ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులుకు గాను 152.91 లక్షల ఎకరాలకు 7645.66 కోట్లు జమ కానున్నాయి. దీనిలో 3.05 లక్షల ఎకరాలకు గాను 94 వేల మంది రైతులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాదారులుగా ఉన్నారు. Telangana Farmers