వార్తలు

తమిళనాడులో భారీ వర్షాలకు నీటమునిగిన 1.5 లక్షల ఎకరాలు…

0
Crop ,lakh acres submerged
Crop ,lakh acres submerged

(Tamil Nadu Rain Live )అతివృష్టి వర్షాలతో రైతులకు ప్రతి ఏడాది నష్టమే వాటిల్లుతుంది. చేతికంది వచ్చిన పంట వరద పాలవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో అదే కొనసాగుతుంది. కొద్దీ రోజులుగా తమిళనాడులో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇళ్లు, ఆస్పత్రుల్లోకి వరద నీరు చేరి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్థి నష్టం, పంట నష్టం జరిగింది. సమాచారం మేరకు 100 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక ఆస్తినష్టంపై అంచనా వేస్తున్నారు అధికారులు

పంట నష్టం…
( Crops on 1.50 lakh acres submerged )తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలకు పంట నీటమునిగింది.తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో వర్షపు నీటికి 1.5 లక్షల ఎకరాల్లో సాగైన పంట నీటమునిగింది. తిరువారుర్​లో 50వేల ఎకరాలు, కుద్దలూరులో 25వేల ఎకరాలు, నాగపట్టినమ్​లో 30వేల ఎకరాలు, మయిలదుథూరైలో 20వేల ఎకరాలు, తంజావుర్​లో 10వేల ఎకరాల పంటలు నీటమునిగినట్టు విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్​ఎస్​ఆర్​ రామచంద్రన్​ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పంటనష్టం అంచనా వేసేందుకు.. సీనియర్‌ మంత్రి పెరియస్వామి సారథ్యంలో సీఎం స్టాలిన్‌ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలోని సభ్యులు – ఐ పెరియసామి, తంగం తెన్నరసు, కెఆర్ పెరియకరుప్పన్, ఎస్ రేఘుపతి, అన్బిల్ మహేష్ పొయ్యమొళి, మరియు శివ వి మెయ్యనాథన్.

( Tamil Nadu CM Stalin )రాష్ట్రంలోని 38 డెల్టా జిల్లాల పర్యవేక్షణ అధికారులుగా నియమితులైన ఐఏఎస్ అధికారులతో సీఎం ఫోన్‌లో మాట్లాడి వర్షాలు, వరదల పరిస్థితిపై చర్చించారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు ఆహారం, వైద్యం, సహాయ సహాకారాలు అందేలా చూడాలని బృందాన్ని సీఎం ఆదేశించారు

#TamilNaduRainsLive #Crop #lakhacressubmerged #TamilNaduLive #Farmers #TamilNaduCMStalin #AgricultureLatestNews #Eruvaaka

Leave Your Comments

పాల ఉత్పత్తికి ప్రాణం పోసిన మిల్క్ మ్యాన్…

Previous article

చేపల పెంపకం రైతుకు పద్మశ్రీ…

Next article

You may also like