రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొస్తున్న ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు వ్యవసాయ పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేంద్రియ సాగులో ఉత్తమ పద్ధతులను తీసుకురావాలని సంకల్పించింది.
ఇందుకోసం ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీ ని తీసుకురానుంది. ఈ పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీ లో ఛైర్మన్ గా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవహరిస్తారు. మరో 17 మందిని సభ్యులు గా నియమించారు. ఈ కమిటీ రాష్ట్రంలో సేంద్రియ సాగు స్థితి గతులను అధ్యయనం చేయడం తో పాటు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై డ్రాఫ్ట్ పాలసీని రూపొందించేందుకు అధ్యయనం చేసి 30 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
ప్రకృతి వ్యవసాయం కోసం ప్రత్యేక పాలసీ..
Leave Your Comments