Health Benefits of Roselle: గోంగూర ఈ పేరు చెప్తే నోరు ఊరని తెలుగు వాళ్ళు ఉండరు.తెలంగాణలో దీన్ని కుంటి కూర అంటారు.గోంగూర రుచికి మాత్రమే కాదు ఆరోగ్య పరమైన విషయాలకి కూడా బాగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా పీచు పదార్ధాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
- ఈ గోంగూరలో ఉండే ముఖ్యమైన విటమిన్స్ ఎ, బి1, బి9, సి.కార్బోహైడ్రేట్ అధికంగా ఉండటం వలన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.పొటాషియం ,కాల్షియం ,సోడియం ,ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ కూరలో.
- గోంగూరలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి కావున రక్త ప్రసరణ సరిగా జరుగుతూ రక్త పోటుని తగ్గిస్తుంది. దీర్గకాలికంగా ఉన్న రోగాల మీద కూడా ఇది దాని ప్రభావం చూపుతుంది.
Also Read: వేరుశనగలో ఎరువుల యజమాన్యం
- అందుకే షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ గోంగూరని వాడటం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.కావున మధుమేహంతో బాధపడేవాళ్ళు రోజు అన్నంలో గోంగూరని తీసుకోవచ్చు.
- అంతేకాదు గోంగూర రోగనిరోధకశక్తిని పెంచుతుంది.గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది.
Also Read: వ్యవసాయ ఉత్పత్తికి గ్రీన్ హౌస్ టెక్నాలజీ
Leave Your Comments