Benefits Of Banana Leaves: పూర్వం మన తాతల కాలంలో అరిటాకులో భోజనం చేసేవారు. ఇప్పుడంటే రకరకాల మార్పులవల్ల ఆ సంప్రదాయం తగ్గిపోయినా కొందరు మాత్రం మన తెలుగింటి సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. కొందరు శుభకార్యాలకు అరిటాకే వాడుతున్నారు. కొన్ని హోటల్స్‌లో ఇప్పటికీ అరిటాకు భోజనమే. వండిన పదార్థాలకు రుచి తీసుకువచ్చే అరిటాకులో భోజనం చేయడంవల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. మరి ఆ అన్నంని అరిటాకులో తింటే ఆరోగ్యానికి, సంప్రదాయానికి ఎంతో మంచిది. అంతెందుకు అరిటాకులో మన శత్రువు కూడా ప్రశాంతంగా భోజనం చేయగలడు. అదెలాగంటే..శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా కడుపునిండా అన్నం తింటారు. Benefits Of Banana Leaves
అరటి ఆకు విస్తర్లలో భోజనం చేస్తే పేగులలోని క్రిములు నాశనమవుతాయి. అరిటాకులలో ఎక్కువగా ఫాలీఫినాల్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరిటాకులో పొటాషియం సమృదిగా ఉండటం వల్ల మన శరీరానికి సరిపడినంత పొటాషియం అందుతుంది. దాంతో గుండెకు సంబంధించిన వ్యాధులను పారద్రోలుతుంది. అదేవిధంగా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఆకలి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు అసిడిటి కడుపు ఉబ్బరం,కాలేయం కిడ్ని సంబంధ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.
కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాల్లో కూడా పండగలు, పర్వదినాల్లో మార్కెట్లో అరటి ఆకులు అమ్ముతున్నారు. వాటిని కొనుక్కుని ఆరోజు వాటిలో భోజనం చేయండి. ఇప్పటి పిల్లలకు కూడా ఇలా తినడం నేర్పించండి. అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడా.