వార్తలు

సేంద్రియ వ్యవసాయంలో సిక్కిం టాప్..

1
Sikkim organic state

Sikkim organic state మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయంలోని ఘనమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత దేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తెర తీస్తోంది. రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గుర్తెరిగి, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వినూత్న పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు.

Sikkim organic state

ప్రపంచంలోనే 100% సేంద్రీయ వ్యవసాయం చేసిన మొదటి రాష్ట్రం సిక్కిం Sikkim organic state. త్వరలో సేంద్రీయ వ్యవసాయంలో దేశానికే కాదు ప్రపంచానికే సిక్కిం దిక్సూచిగా మారుతుందనడంలో సందేహమే లేదు. తమ ప్రకృతి వనరులను కాపాడుకోవటానికి గ్రామాలలో నివసించే 80% ప్రజల ప్రధాన జీవనాధారమైన వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 2003 లోనే అధికారికంగా పూర్తి సేంద్రియ రాష్ట్రంగా మారటానికి నిర్ణయం తీసుకున్నది. సిక్కిం రాష్ట్ర పూర్తి విస్తీర్ణం 7,29,900 హెక్టార్లు మాత్రమే. అందులో వ్యవసాయం చేసేది కేవలం 10.20 % విస్తీర్ణం మాత్రమే. ఆ రాష్ట్రంలోని మొత్తం రైతులు 64,088 గా గుర్తించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కాగా సిక్కిం రాష్ట్రంలో ప్రధాన పంటలు మొక్కజొన్న, వరి, గోధుమ, మినుములు, సోయా, ఆవాలు, ఆరంజ్, పియర్, అల్లం, పసుపు, యాలుకలు, చెర్రీ పెప్పర్, బటాని మరియు కూరగాయలలో టమాటో, బంగాళదుంప, కాలిఫ్లవర్, కాబేజీ, పూలల్లో గులాబీలు, గేర్బెర, అంతురియం ముఖ్యమైనవి. విశేషం ఏంటంటే.. బంగాళాదుంప, కాలిఫ్లవర్, కాబేజీ, బటాని ల విత్తనోత్పత్తి కి సిక్కిం వాతావరణం అనుకూలమైనదిగా చెప్పవచ్చు.

Sikkim organic state

కాగా.. భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయంలో పాలుపంచుకున్న ఇతర రాష్ట్రాలు చూస్తే గుజరాత్, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

Agriculture News, Wordls Organic Farming. Eruvaaka Agriculture News

Leave Your Comments

50% శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గించిన యూపీ గవర్నమెంట్

Previous article

భారత్ ఉత్పత్తులు మామిడి, దానిమ్మ అమెరికాకు ఎగుమతి

Next article

You may also like